
ఉత్తమ ఫలితాల సాధనకు..
అన్ని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల్లో 9,10 తరగతుల విద్యార్థులకు సాయంత్రం ప్రత్యేక తరగతులను ప్రారంభించాం. దీనికి సంబంధించిన టైం టేబుల్‌ను అన్ని పాఠశాలలకు పంపించాం. ఈ విద్యా సంవత్సరం పదో తరగతిలో వంద శాతం ఉత్తీర్ణత కోసం కృషి చేస్తున్నాం.
–అశోక్, జిల్లా విద్యాశాఖ అధికారి
చిలుకూరు: సాధారణంగా ప్రతి సంవత్సరం పదో తరగతి విద్యార్థులకు ఉదయం, సాయంత్రం స్టడీ అవర్స్ నిర్వహించేవారు. కానీ గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ సారి కలెక్టర్ చొరవతో 9,10 తరగతుల విద్యార్థులకు సిలబస్ త్వరితగతిన పూర్తి చేయడమే కాకుండా ఉత్తమ ఫలితాల సాధనకు ప్రత్యేక క్లాసులు నిర్వహిస్తున్నారు. సాయంత్రం మాత్రమే నిర్వహించే ఈ ప్రత్యేక తరగతులు సోమవారం నుంచే ప్రారంభమయ్యాయి. జిల్లా వ్యాప్తంగా 229 జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల్లో 9,10 తరగతులు చదువుతున్న 17వేల మంది విద్యార్థులకు ఈ ప్రత్యేక తరగతుల వల్ల ప్రయోజనం కలగనుంది.
సాయంత్రం వేళల్లో..
ఈ నెల 1 నుంచి డిసెంబర్ వరకు 120 రోజుల పాటు 9,10 తరగతుల విద్యార్థులకు ప్రత్యేక తరగుతులు నిర్వహించేలా ప్రణాళిక రూపొందించారు. రోజూ సాయంత్రం 4.20 నుంచి 5.20 వరకు గంట పాటు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. రోజూ ఒక సబ్జెక్టు చొప్పున సబ్జెక్టు టీచర్ ప్రత్యేకంగా క్లాస్ తీసుకుంటాడు. డిసెంబర్ చివరి నాటికి పదో తరగతి విద్యార్థులకు సిలబస్ పూర్తి చేసి, ఆ తరువాత మళ్లీ ఫైనల్ పరీక్షల వరకు ప్రత్యేక స్టడీ అవర్స్ నిర్వహించనున్నారు. ప్రత్యేక తరగతులకు హాజరవుతున్న విద్యార్థులకు అల్పాహారం ఇచ్చే విషయంపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. మధ్యాహ్నం ఒంటి గంట లోపే మధ్యాహ్న భోజనం చేస్తుడండం.. సాయంత్రం లేటుగా వెళ్లడంతో ఆ సమయంలో విద్యార్థులు కొంత ఆకలికి గురి అవుతారు. అందువల్ల ఆ సమయంలో అల్పాహారం ఏర్పాటు చేస్తే బాగుంటుందని విద్యార్థులు కోరుతున్నారు.
ఫ 9,10 తరగతులకు ప్రారంభమైన ప్రత్యేక తరగతులు
ఫ 120 రోజుల ప్రణాళిక
ఫ డిసెంబర్ వరకు క్లాసుల నిర్వహణ
ఫ 17వేల మంది విద్యార్థులకు ప్రయోజనం

ఉత్తమ ఫలితాల సాధనకు..