
రైతులకు మెరుగైన సేవలందించాలి
కోదాడ: నీటిపారుదలశాఖ అధికారులకు కావాల్సిన అన్ని రకాల సౌకర్యాలను ప్రభుత్వం కల్పిస్తుందని అధికారులు రైతులకు మెరుగైన సేవలందించాలని రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాలశాఖ మంత్రి నలమాద ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కోరారు. కోదాడ ఎన్‌ఎస్‌పీ క్యాంప్ ఆవరణలో రూ. 5 కోట్లతో నిర్మించనున్న నీటిపారుదలశాఖ డివిజన్ కార్యాలయానికి , రూ. 54 కోట్లతో అనంతగిరి మండలం శాంతినగర్ వద్ద నిర్మించనున్న రాజీవ్‌శాంతినగర్ ఎత్తిపోతల పథకానికి మంత్రి శంకుస్థాపన చేశారు. అనంతరం కోదాడ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కోదాడ డివిజన్‌లో 2.29 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే అధికారులకు నాలుగు అంతస్తుల్లో నూతన కార్యాలయాన్ని నిర్మిస్తున్నామని, సంవత్సరంలోపే పనులు పూర్తి చేయాలని ఆదేశించారు.
గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల శిథిలావస్థకు..
వైఎస్సార్ సీఎంగా ఉన్న సమయంలో అనంతగిరి మండలం శాంతినగర్ వద్ద రూ.5 కోట్లతో ఏర్పాటు చేసిన ఉత్తమ్ పద్మావతి ఎత్తిపోతల పథకం గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల శిథిలావస్థకు చేరుకుందని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆరోపించారు. ఉత్తమ్ పద్మావతి ఎత్తిపోతల పథకం స్థానంలో రూ.54 కోట్లతో అనంతగిరి మండలంలోని 8 గ్రామాలలో 3,219 ఎకరాలు, కోదాడ మండలంలోని 1,781 ఎకరాలకు సాగునీరు అందించే విధంగా రాజీవ్ శాంతినగర్ ఎత్తిపోతల పథకాన్ని ఏర్పాటు చేస్తున్నామన్నారు. దీని ద్వారా 2,138 రైతు కుటుంబాలకు మేలు కలుగుతుందన్నారు. మోతె మండలంలోని 45 వేల ఎకరాలకు సాగునీరు అందించే ఎత్తిపోతల పథకానికి రూపకల్పన చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్, ఎస్పీ నరసింహ, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ వంగవేటి రామారావు, మాజీ ఎమ్మెల్యే వేనేపల్లి చందర్‌రావు, ఎడమ కాలువ మాజీ చైర్మన్ చింతకుంట్ల లక్ష్మీనారాయణరెడ్డి, ఎస్‌ఈ రమేష్‌బాబు తదితరులు పాల్గొన్నారు.
ఫ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి