
పనులు వదిలేసి
మూడు రోజుల నుంచి ఇక్కడే ఉంటున్నాను
రాత్రి ఇక్కడే పడుకోవాల్సి వస్తోంది
రాత్రింబవళ్లు పడిగాపులు
ఆత్మకూర్ (ఎస్)(సూర్యాపేట) : యూరియా కోసం రైతులు నానా అగచాట్లు పడుతున్నారు. వ్యవసాయ పనులు వదులుకొని పీఏసీఎస్‌ల వద్ద రాత్రింబవళ్లు పడిగాపులు కాస్తున్నారు. కేంద్రాల వద్దే చెప్పులు, ఆధార్‌కార్డులు లైన్‌లో పెట్టి నిద్రపోయినా ఫలితం దక్కడంలేదు.
మూడు రోజులుగా
ఆధార్‌కార్డులు, పాస్‌బుక్‌లు లైన్‌లో పెట్టి..
ఆత్మకూర్(ఎస్) మండల పరిధిలోని నెమ్మికల్, ఆత్మకూర్ పీఏసీఎస్‌లకు నాలుగు రోజుల క్రితం యూరియా రాగా అందరు రైతులకు అందలేదు. దీంతో మళ్లీ యూరియా వస్తే తాము ముందు వరుసలో ఉండాలని మూడు రోజులుగా రైతులు తమ ఆధార్ కార్డులు, పాస్ పుస్తకాలను లైన్లో ఉంచి అక్కడే రాత్రింబవళ్లు ఎదురు చూస్తున్నారు. రాత్రిపూట సైతం మహిళలతో పాటు అక్కడే నిద్రపోతున్నారు. వీరికి ఆ గ్రామాల నుంచి కుటుంబ సభ్యులు భోజనాన్ని, మంచినీటిని పంపిస్తున్నారు. అసలే వ్యవసాయ పనులు బిజీగా ఉన్న సమయంలో పనులు వదులుకొని మహిళా రైతులతో సహా పడిగాపులు కాస్తున్నారు.
నేడు మండలానికి 35 టన్నుల యూరియా
ఆత్మకూర్(ఎస్) మండలంలోని ప్రాథమిక సహకార సొసైటీకి గురువారం 35 టన్నుల యూరియా రానున్నట్లు వ్యవసాయ అధికారి దివ్య తెలిపారు. మండలంలోని ఆత్మకూరుకు 13 టన్నులు, ఏపూరుకు 12 టన్నులు, నెమ్మికల్‌కు 10 టన్నుల చొప్పున యూరియా వస్తుందని, రైతులు సకాలంలో వచ్చి యూరియా కొనుగోలు చేయాలని కోరారు.
ఫ యూరియా కోసం రైతులకు తప్పని అగచాట్లు
ఫ కేంద్రాల వద్దనే నిద్రపోతున్న దుస్థితి
ఫ నెమ్మికల్ పీఏసీఎస్ వద్ద మూడు రోజులుగా నిరీక్షణ
ఫ బస్తాలు ఎప్పుడు వస్తాయోనని కళ్లు కాయలు కాసేలా ఎదురుచూపు
నాలుగు ఎకరాల్లో నాటుపెట్టాం. 10 కట్టలు యురియా కావాలి. నాలుగు రోజుల క్రితం యూరియా దొరకకపోవడంతో ఇక్కడే ఆధార్ కార్డులు లైన్లో పెట్టి
ఉంటున్నాం.
– బానోత్ రవి, బోరింగ్‌తండా
యూరియా దొరకక పోవడంతో మూడు రోజుల నుంచి రాత్రిపూట సైతం ఇక్కడే పడుకొని యూరియా కోసం పడిగాపులు కాస్తున్నాం. ఎప్పుడు వస్తుందో ఎవరూ చెప్పడం లేదు.
– తండు వెంకటమ్మ, పాతర్ల పహాడ్

పనులు వదిలేసి

పనులు వదిలేసి