
పూర్వ ప్రాథమిక విద్యకు ఆదరణ
మూడు సంవత్సరాలు ఉన్న పిల్లలకు ప్రభుత్వ పాఠశాలల్లోనే పూర్వ ప్రాథమిక విద్య అందుతోంది. చిన్నారులకు ఆట, పాటలతో పాఠాలు బోధిస్తున్నారు.
– అశోక్, జిల్లా విద్యాధికారి.
తిరుమలగిరి (తుంగతుర్తి) : ప్రభుత్వ పాఠశాలల్లో ఈ విద్యా సంవత్సరం నుంచి అందుబాటులోకి తెచ్చిన పూర్వ ప్రాథమిక విద్యకు ఆదరణ లభిస్తోంది. ఆట పాటలతో ఆహ్లాదకర వాతావరణంలో పాఠాలు బోధిస్తుండడంతో వీటిలో చేరడానికి పిల్లలు ఆసక్తి కనబరిచారు. జిల్లా వ్యాప్తంగా తొలివిడత ఏర్పాటు చేసిన 30 పాఠశాలల్లో సుమారు 600 మందికిపైగా పిల్లలు చదువుకుంటున్నారు. ఒక్కో పాఠశాలలో రూ.1.70లక్షలతో వసతులు కల్పించారు. దీని కోసం ప్రత్యేకంగా బోధకులు, ఆయాలను నియమించారు.
ప్రవేశాలు పెరిగేలా చర్యలు
అంగన్‌వాడీ కేంద్రాల్లో పూర్వ ప్రాథమిక విద్య, ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో 1వ తరగతి నుంచి విద్య అమలవుతోంది. చాలా మంది పిల్లలు అంగన్‌వాడీ కేంద్రాల్లో విద్య పూర్తయిన తరువాత పాఠశాలలో ప్రవేశాలు తీసుకోకుండా ప్రైవేట్‌కు వెళుతున్నారు. దీంతో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య తగ్గుతోంది. ప్రభుత్వ పాఠశాలల్లో పూర్వ ప్రాథమిక విద్య బోధించాలని విద్యా శాఖ నిర్ణయించింది. ఇక ప్రాథమిక పాఠశాల ఆవరణలో తరగతులు నిర్వహిస్తున్నారు. తొలి విడతలో 30 పాఠశాలల్లో ఏర్పాటు చేశారు.
వసతులు ఇలా..
ఒక్కో పాఠశాలకు రూ.1.70లక్షల చొప్పున మంజూరు చేశారు. వీటి నుంచి రూ.50వేలతో ఫర్నిచర్, రూ.50వేలతో ఇండోర్, ఔట్‌డోర్ సామగ్రి, రూ.70వేలతో తరగతి గదులను ప్రత్యేకంగా అలంకరించారు. ఆహ్లాదకరమైన వాతావరణంలో చిన్నారులను ఉత్తమంగా తీర్చిదిద్దడానికి చర్యలు తీసుకున్నారు.
ఫ తొలి విడత ఎంపిక చేసిన 30 పాఠశాలల్లో 600 మంది చిన్నారులు
ఫ ఒక్కో పాఠశాలలో రూ.1.70లక్షలతో వసతులు
ఫ నాలుగు నెలలుగా ఆటపాటలతో బోధన