
ఏసీ, రిఫ్రిజ్‌రేటర్ రిపేరింగ్‌లో ఉచిత శిక్షణ
భానుపురి (సూర్యాపేట) : నల్లగొండ శివారులోని ఎస్‌బీఐ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థలో గ్రామీణ నిరుద్యోగ పురుషులకు ఏసీ, రిఫ్రిజ్‌రేటర్ రిపేరింగ్‌లో ఉచిత శిక్షణ అందిస్తున్నట్లు సంస్థ సంచాలకుడు రఘుపతి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. శిక్షణ కాలంలో ఉచిత వసతి, భోజనం కల్పిస్తామని పేర్కొన్నారు. పదవ తరగతి పాసైన 18 నుంచి 45 సంవత్సరాల లోపు వయస్సు గల నల్లగొండ, సూర్యాపేట, యదాద్రి భువనగిరి జిల్లాల వారు అర్హులని తెలిపారు. ఆసక్తి గలవారు సంస్థ ఆఫీ సులో సెప్టెంబర్ 5 లోపు దరఖాస్తు చేసుకోవా లని సూచించారు. ఇతర వివరాల కోసం 970 1009265 నంబర్‌ను సంప్రదించాలని కోరారు.
పరిశుభ్రతతోనే
వ్యాధులు దూరం
ఫ జెడ్పీ సీఈఓ వి.వి.అప్పారావు
పెన్‌పహాడ్ : పరిసరాల పరిశుభ్రతతోనే వ్యాధులను దూరం చేసుకోవచ్చని జెడ్పీ సీఈఓ వి.వి.అప్పారావు సూచించారు. బుధవారం పెన్‌పహాడ్ మండల పరిధిలోని సింగారెడ్డిపాలెం, అనంతారం గ్రామాలను సందర్శించారు. సింగారెడ్డిపాలెంలో పూర్తయిన పశువుల కొట్టాలతో పాటు నిర్మాణంలో ఉన్న పనులను పరిశీలించారు. అనంతారంను ఇంకుడు గుంతల నిర్మాణానికి పైలట్ గ్రామంగా ఎంపిక చేయగా సందర్శించారు. గ్రామంలో బోర్‌వెల్ రీచార్జ్ స్ట్రక్చర్, ఇంకుడు గుంతల పనులు, నర్సరీని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. సంపులు, నీటి తొట్లలో మూడు నాలుగు రోజుల కంటే ఎక్కువ రోజులు నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలన్నారు. జెడ్పీ సీఈఓ వెంట ఏపీఓ రవి, ఈసీ మహేష్, టీఏలు ఏకస్వామి, రామకృష్ణ, పంచాయతీ కార్యదర్శులు అఖిల్, సోమయ్య, ఎఫ్‌ఏలు జ్యోతి, బేగం ఉన్నారు.