
తెల్లవారు జాము నుంచే..
అనంతగిరి: అనంతగిరి మండల పరిధిలోని అమీనాబాద్ పీఏసీఎస్ గోదాం వద్ద రైతులు యూరియా కోసం తెల్లవారు జాము నుంచే క్యూలైన్‌లో నిలబడి పడిగాపులు కాస్తున్నారు. బుధవారం సుమారు 260 మంది రైతులు వచ్చారు. వీరు క్యూలైన్‌లో నిలబడి అలసిపోయిన చివరికి చెప్పులను ఉంచారు. సుమారు 220 బస్తాల యూరియా రాగా పోలీసుల సహకారంతో అధికారులు ఒక్కో రైతుకు ఒక్కో బస్తా చొప్పున అందజేశారు. మిగతా రైతులు నిరాశతో వెనుదిరిగి వెళ్లారు.
అమీనాబాద్ పీఏసీఎస్ గోదాము ఎదుట రైతులు క్యూలైన్‌లో పెట్టిన చెప్పులు