
యువతను సన్మార్గంలో నడిపించాల్సి బాధ్యత ప్రతి ఒక్కరిది
సూర్యాపేటటౌన్ : యువత గంజాయి మత్తుకు బానిస కాకుండా సన్మార్గంలో నడిపించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ఎస్పీ కె.నరసింహ పేర్కొన్నారు. పాత నేరస్తులు, హిస్టరీ షీట్స్ కలిగిన వ్యక్తులు, గంజాయి కేసులో ఉన్న నిందితులకు చట్టాలపై సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ఓ ఫంక్షన్ హాల్‌లో శనివారం అవగాహన కల్పించారు. సమస్యలు సృష్టించే వారిని, నేరాలకు పాల్పడే వారిని, గంజాయి రవాణా, వినియోగం చేసే వారిని హెచ్చరించారు. అనంతరం మాట్లాడారు. అలవాటుగా అదే రకమైన నేరానికి పాల్పడితే పీడీ యాక్ట్ నమోదు చేసి జైలుకు పంపుతామన్నారు. ఇలాంటి వ్యక్తులకు ముందస్తుగా కౌన్సెలింగ్ నిర్వహిస్తామని, ఆ తర్వాత బైండోవర్ చేస్తామన్నారు. పాతనేరస్తులు బైండోవర్ నిబంధనలకు కట్టుబడి ఉండాలన్నారు. ఈ సమావేశంలో సూర్యాపేట డీఎస్పీ ప్రసన్నకుమార్, సీఐలు వెంకటయ్య, రాజశేఖర్, నాగేశ్వర్‌రావు, నరసింహారావు, స్పెషల్ బ్రాంచ్ ఇన్‌స్పెక్టర్ రామారావు పాల్గొన్నారు.
ఫ ఎస్పీ నరసింహ