
యువ న్యాయవాదులు వృత్తిలో రాణించాలి
చివ్వెంల: యువ న్యాయమూర్తులు, న్యాయవాదులు వృత్తిలో రాణించాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి పి.లక్ష్మీశారద అన్నారు. శుక్రవారం సూర్యాపేట జిల్లా కోర్టు ప్రాంగణంలో బార్ అసోసియేషన్ హాల్‌లో అదనపు జూనియర్ సివిల్ జడ్జిగా బాధ్యతలు స్వీకరించిన మంచాల మమత పరిచయ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. చిన్న వయస్సులో జడ్డిగా ఎంపికై న మమతను శాలువాతో సత్కరించి అభినందించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ సివిల్ జడ్జి ఫర్హీన్ కౌసర్, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి గోపు రజిత, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కొంపల్లి లింగయ్య, ప్రధాన కార్యదర్శి సుంకరబోయిన రాజు, సీనియర్, జూనియర్ న్యాయవాదులు పాల్గొన్నారు.
ఫ జిల్లా ప్రధాన న్యాయమూర్తి లక్ష్మీశారద