
ఏ పంట.. ఎన్ని ఎకరాలు
నాగారం : పంటల సర్వేకు అధికారులు సన్నద్ధమవుతున్నారు. వచ్చేనెల 1 నుంచి వ్యవసాయ విస్తరణ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి ఏ రైతు ఎన్ని ఎకరాల్లో ఏయే పంటలు వేశాడో వివరాలు నమోదు చేయనున్నారు. ప్రతి క్లస్టర్ పరిధిలో రెండు వేల ఎకరాల చొప్పున డిజిటల్ విధానం, మిగితాది సాధారణ పద్ధతిలో సర్వే చేసేలా ప్రణాళిక రూపొందించారు. నవంబర్ 5న సర్వే వివరాలన్నీ పంచాయతీల్లో ప్రదర్శించనున్నారు.
కొన్ని గ్రామాల్లో డిజిటల్..
మరికొన్నింటిలో సాధారణ పద్ధతి..
జిల్లాలో సీజన్ల వారీగా ఏటా ప్రభుత్వం పంటల సమగ్ర సర్వే చేస్తుంది. వ్యవసాయ సిబ్బంది పంట పొలాలను సందర్శించకుండా, రైతులను అడిగి వివరాలు సేకరిస్తుండటంతో పంట ఉత్పత్తుల క్రయవిక్రయాల సమయంలో పలు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం డిజిటల్ క్రాప్ సర్వేకు శ్రీకారం చుట్టింది. గతేడాది కొన్ని ప్రాంతాల్లో ప్రయోగాత్మకంగా సర్వే చేశారు. డిజిటల్ సర్వే చేయాలంటే వ్యవసాయ విస్తరణాధికారులు తప్పనిసరిగా పంట పొలాన్ని సందర్శించాల్సి ఉంటుంది. రైతుల వారీగా ప్రతి సర్వే నంబర్‌ను సందర్శించడం కష్టం అవుతుందని నిరాకరించారు. చివరికి గతేడాది మాదిరిగానే ఈ సీజన్‌లోనూ ప్రయోగాత్మకంగా కొన్ని గ్రామాల్లో డిజిటల్ క్రాప్, మిగిలిన గ్రామాల్లో పాత పద్ధతి లోనే సర్వే చేయాలని ఆదేశాలు వచ్చాయి. ప్రతి క్లస్టర్‌లో 2 వేల ఎకరాల్లో డిజిటల్ క్రాప్ సర్వే చేయాలి. క్లస్టర్ పరిధిలో పురుష ఏఈఓలు 2 వేల ఎకరాలు, మహిళా ఏఈఓలు 1,800 ఎకరాల్లో సర్వే చేయాలని ప్రభుత్వం ఆదేశించింది.
అక్టోబర్ 25నాటికి పూర్తి
అధికారులు సర్వే నంబర్ వారీగా పంట పొలాన్ని సందర్శించి, వివరాలను నమోదు చేయడంతో పాటు ఫొటో తీసి అప్‌లోడ్ చేయాలి. రైతు పేరు, ఆధార్ నంబర్, మొబైల్ నంబర్ నమోదు చేయాలి. ఎన్ని ఎకరాల్లో పంట వేశారనే సమాచారం రైతుల మొబైల్‌కు చేరేలా ఏర్పాట్లు చేస్తున్నారు. పంట లేకుంటే నో క్రాప్ అని నమోదు చేయాలి. ఈ ఏడాది అక్టోబరు25 నాటికి క్రాప్ సర్వే పూర్తి చేసి, 27న గ్రామ పంచాయతీల్లో వివరాలు ప్రదర్శించాల్సి ఉంది. పంటల నమోదులో తప్పులుంటే రైతులు.. ఏఈఓల దృష్టికి తీసుకెళ్లాలి. మార్పులు, చేర్పుల అనంతరం నవంబర్ 5వ తేదీన తుది జాబితాను ప్రదర్శిస్తారు.
రేపటి నుంచి పంటల సర్వే
ఫ సర్వే నంబర్ల వారీగా
వివరాల నమోదు
ఫ ప్రతి క్లస్టర్‌లో 2వేల ఎకరాల చొప్పున డిజిటల్.. మిగిలింది సాధారణ సర్వే చేసేలా ప్రణాళిక
ఫ నవంబర్ 5న గ్రామ పంచాయతీల్లో తుది వివరాల ప్రదర్శన
రైతుల సంఖ్య 2.81 లక్షలు
క్లస్టర్లు 82
పంటల సాగు
6.17 లక్షల ఎకరాలు

ఏ పంట.. ఎన్ని ఎకరాలు