
నెరవేరుతున్న పేద ప్రజల సొంతింటి కల
పెన్‌పహాడ్ : పేదలకు ఇందిరమ్మ ఇళ్లతో సొంతింటి కల నెరవేరుతోందని ఏఐసీసీ సభ్యుడు రాంరెడ్డి సర్వోత్తమ్‌రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి అన్నారు. శనివారం లింగాల, దూపహాడ్, న్యూబంజారాహిల్స్ తండా, జల్మాలకుంట తండా, యల్లప్పకుంట, గూడెపుకుంట తండాల్లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి భూమి పూజ చేశారు. అనంతరం లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్లు, రేషన్‌కార్డుల మంజూరు పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే 3500 ఇళ్లు మంజూరు చేసిందని తెలిపారు. రైతు రుణమాఫీ, ఉచిత బస్సు ప్రయాణం, రైతు భరోసా, సన్నబియ్యం, ఉచిత విద్యుత్ అందిస్తోందని అన్నారు. గత ప్రభుత్వం పదేళ్ల కాలంలో ఏ ఒక్కరికి రేషన్‌కార్డు అందించిన దాఖలాలు లేవని, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే పేదలందరికీ రేషన్‌కార్డులు అందించిందని తెలిపారు. కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు తూముల సురేష్‌రావు, జిల్లా యూత్ అధ్యక్షు డు ఎలిమినేటి అభినయ్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ మిడిమేలపు దామోదర్‌రెడ్డి, అర్తి కేశవులు, తంగెళ్ల కరుణాకర్‌రెడ్డి, పిన్నాని కోటేశ్వర్‌రావు, నారాయణ ప్రవీణ్‌రెడ్డి, గాంధీ, భూక్య సందీప్‌రాథోడ్, శివనాయక్, సైదిరెడ్డి, దొంగరి సైదులు పాల్గొన్నారు.