
అంబకపల్లెకు కృష్ణా జలాలు వచ్చి చేరాయి. ఈ సందర్భంగా కృష్ణమ్మకు వైఎస్ జగన్ జల హారతి ఇచ్చారు.

పాడా నిధుల ద్వారా అంబకపల్లె గంగమ్మ కుంటకు రూ.1.4 కోట్లతో 14 ఎకరాల భూసేకరణ చేపట్టి కొత్త చెరువును నిర్మించారు.

ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి ఎంపీ నిధులతో రూ.2.50 కోట్లు వెచ్చించి హిరోజ్‌పురం గ్రామం వద్ద భారీ సంప్‌ను ఏర్పాటు చేసి 4.5 కి.మీ మేర అంబకపల్లె చెరువుకు పైపులైన్ ఏర్పాటు చేశారు.

ఫలితంగా అంబకపల్లె చెరువుకు కృష్ణా నీరు వచ్చి చేరింది. దీంతో ఈ ప్రాంత వాసులంతా సంతోషం వ్యక్తం చేశారు.











