
నాణ్యతా ప్రమాణాలతో ఇళ్లు నిర్మించుకోవాలి
భానుపురి (సూర్యాపేట): ఇందిరమ్మ ఇళ్లను నాణ్యతా ప్రమాణాలతో నిర్మించుకోవాలని కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్ అన్నారు. సూర్యాపేట మున్సిపాలిటీ పరిధిలోని 318 మంది లబ్ధిదారులకు శుక్రవారం కలెక్టరేట్‌లో ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పట్టాలను పంపిణీ చేసి మాట్లాడారు. సూర్యాపేట మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి మాట్లాడుతూ ఇళ్లు రానివారు ఉంటే దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఆర్డీఓ వేణుమాధవ్, హౌసింగ్ పీడీ సిద్ధార్థ, సూర్యాపేట మున్సిపల్ కమిషనర్ హనుమంత్‌రెడ్డి, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ శ్రీనివాస్, హౌసింగ్ ఇన్‌స్పెక్టర్ అబ్దుల్లా, అధికారులు పాల్గొన్నారు.
కొత్త పరిశ్రమలకు అనుమతులు ఇవ్వాలి
కొత్త పరిశ్రమలకు వెంటనే అనుమతులు ఇవ్వాలని కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్ ఆదేశించారు. శుక్రవారం సూర్యాపేట కలెక్టరేట్‌లోని తన చాంబర్‌లో జిల్లా పరిశ్రమల ప్రోత్సాహక, టీజీ ఐపాస్ కమిటీలతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో మాట్లాడారు. సమావేశంలో జిల్లా పరిశ్రమల మేనేజర్ సీతారాం నాయక్, విద్యుత్ శాఖ ఏడీఈ అశోక్, జిల్లా టౌన్ కంట్రీ ప్లానింగ్ అధికారి మాధవి, ఫాక్టరీస్ ఇన్‌స్పెక్టర్ శ్రీదేవి, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ ఎల్.శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
ఫ కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్