short circuit: పొలంలో పని చేస్తుండగా వరికోత మిషన్‌ దగ్ధం

- - Sakshi

పెన్‌పహాడ్‌ : షార్ట్‌సర్క్యూట్‌తో వరికోత మిషన్‌ దగ్ధమైంది. ఈ ఘటన పెన్‌పహాడ్‌ మండల పరిధిలోని సింగారెడ్డిపాలెం గ్రామంలో శుక్రవారం చోటు చేసుకుంది. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌ మండలం శివారెడ్డిగూడెం గ్రామానికి చెందిన రవీందర్‌రెడ్డికి చెందిన వరికోత చైన్‌ మిషన్‌ సింగారెడ్డిపాలెంలోని రైతు పేర్ల లింగయ్య పొలాన్ని కోస్తున్న సమయంలో విద్యుత్‌ తీగలకు తగిలి షార్ట్‌సర్క్యూట్‌కు గురై దగ్ధమైనట్లు బాధితులు తెలిపారు. అగ్నిమాపక శాఖ అధికారులకు సమాచారం ఇవ్వడంతో ఫైర్‌ ఇంజన్‌తో వచ్చి మంటలను అదుపు చేశారు.

రోడ్డు ప్రమాదంలో  గాయపడిన వ్యక్తి మృతి
మునగాల(కోదాడ): రోడ్డు ప్రమాదంలో గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వ్యక్తి మృతిచెందాడు. మునగాల మండలం ముకుందాపురం గ్రామానికి చెందిన రైతు మాదాసు సైదులు(58) గురువారం ట్రాక్టర్‌ నడుపుకుంటూ ఆకుపాముల శివారులో గల కంకర మిల్లు నుంచి కోదాడ వైపు వెళ్లే రహదారిలో హైవే ఎక్కుతున్నాడు. ఈ క్రమంలో హైదరాబాద్‌ నుంచి విజయవాడ వైపు వెళ్లే ఆర్టీసీ బస్సు ట్రాక్టర్‌ను వెనుకనుంచి ఢీకొట్టింది.

ప్రమాదంలో ట్రాక్టర్‌ బోల్తాకొట్టడంతో సైదులుకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు సైదులును 108వాహనంలో సూర్యాపేట ఏరియా ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతున్న సైదులు శుక్రవారం తెల్లవారుజామున మృతిచెందినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. మృతుడికి భార్య, ముగ్గురు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. ఈ మేరకు మునగాల పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

విద్యుదాఘాతంతో ఆవు మృతి
నిడమనూరు:
మండలంలోని రేగులడ్డ గ్రామంలో శుక్రవారం లింగాల రాజ మ్మకు చెందిన ఆ వు విద్యుదాఘాతంతో మృతిచెందింది. రోజు వారీగా ఆవులను మేత కోసం గ్రామ సమీపంలోకి తీసుకువెళ్లారు. ట్రాన్స్‌ఫార్మర్‌ వద్ద ఆవు గడ్డి మేస్తూ వైర్లకు తగలడంతో విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతి చెందిందని యజమానురాలు తెలిపింది.

ఇది చదవండి: పొలం ఇప్పుడే ఇవ్వడం కుదరదన్న అత్తమామ.. మామపై అల్లుడి దారుణం!

Read latest Suryapet News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top