● జగనన్న కాలనీలపై సర్కారు చిన్నచూపు
● మౌలిక వసతులు కల్పనకు నిధులు విదల్చని వైనం
● తీవ్రంగా ఇబ్బంది పడుతున్న పేదలు
పట్టా వచ్చింది.. ఇల్లు నిర్మాణమైంది.. చిరునామా చెప్పుకునేందుకు ఓ సొంత గూడు దొరికింది. పేదింటిలో చిరు నవ్వు విరబూసింది.. అంతే రెండున్నరేళ్ల కిందటి ఆ నిర్మాణాలు తప్ప తర్వాత ఓ చిన్న రోడ్డయినా వేయలేదు. జిల్లాలో వందలాది మంది పేదలకు గూడు కల్పించిన జగనన్న కాలనీలపై సర్కారు శీతకన్ను వేసింది. కాలనీల్లో కల్పించాల్సిన సదుపాయాలను విస్మరించింది. పేదలపై దయ లేనట్టు, వారి ఇళ్లకు సదుపాయాలు కల్పించడం తమ పని కాదన్నట్లు వ్యవహరిస్తోంది.
నిర్మాణంలో ఉన్న ఇళ్లకు సాయం అందించి పూర్తి చేయాల్సిన కూటమి సర్కారు స్పందించడమే లేదు. అప్పట్లో వేసిన లే అవుట్లకు ఆనాడే మౌలిక వసతులు కల్పించారు. ప్రధానంగా నీరు, విద్యుత్ సదుపాయాలు కల్పించారు. ఇక రోడ్లు, కాలువలు వంటివి కల్పించాల్సి ఉండగా.. ఎన్నిక లు వచ్చి ప్రభుత్వం మారింది. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత రోడ్లు, కాలువలు నిర్మి స్తామని ఆశించారు. కానీ వారి ఆశలు అడియాసలయ్యాయి. చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన రెండేళ్లు పై బడినా, ఒక్క రోడ్డు కూడా వేయలేదు.
శ్రీకాకుళం పాతబస్టాండ్: రెండేళ్లుగా ఒక్క పట్టా ఇవ్వలేదు.. ఒక్క ఇంటిని కూడా నిర్మించలేదు. నిర్మించిన ఇళ్ల వద్ద సదుపాయాలూ కల్పించలేదు. కూటమి సర్కారు ఘనతలివి. పేదలకు గత ప్రభుత్వంలో ఇచ్చిన కాలనీల్లో మౌలిక సదుపాయాలు కల్పించడం లేదు. దీంతో జగనన్న కాలనీ వాసులు కూటమి ప్రభుత్వ తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కాలనీల్లో ఉన్న ప్రజలు వర్షాలకు, ఇతర సమస్యలకు ఇబ్బందులు పడుతున్నారు. ఇళ్ల నిర్మాణాల బిల్లులు, అవసరం ఉన్న వారికి కొత్త ఇళ్లు వంటివేవీ మంజూరు చేయలేదు. ఎన్నికల ముందు మూడు సెంట్లు ఇస్తా మని చెప్పిన వారు ఒక్క సెంటు కూడా మంజూరు చేయలేదు.
గత ప్రభుత్వంలో ఇలా..
వైఎస్ జగన్ పాలనలో పేదల ఇళ్ల నిర్మాణాలకు పెద్దపీట వేశారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం హ యాంలో జిల్లాలో 30 మండలాలు, నాలుగు పురపాలక సంఘాల పరిధిలో 75,840 ఇళ్లు మంజూరు చేశారు. వీటికి గాను 834 లే అవుట్‌లను ప్రభుత్వం వేసింది. వీటిలో 38,773 ఇళ్లను మంజూరు చేశారు. సొంత స్థలం ఉన్నవారికి 37,067 ఇళ్లను మంజూరు చేశారు. ఇప్పటికే 38,942 ఇళ్లు పూర్తయ్యి లబ్ధిదారులు నివాసం ఉంటున్నారు. మిగిలిన ఇళ్లు వివిధ దశల్లో ఉన్నాయి.
‘పేరు’ కోసమేనా..?
జగనన్న కాలనీల్లో మౌలిక వసతులు కల్పిస్తే వైఎస్ జగన్‌కు పేరు వెళ్లిపోతుందని కూటమి సర్కారు బ లంగా విశ్వసిస్తోంది. వైఎస్ జగన్ ప్రభుత్వం రైతు ల నుంచి భూములను కొని లేఅవుట్‌లు వేసి, లబ్ధిదారులకు ఇళ్ల స్థలాలను రిజిస్ట్రేషన్ చేయించి ఇచ్చింది. అంతే కాకుండా నిర్మాణానికి నిధులు అందజేసి, నిర్మాణాలు శరవేగంగా జరిగే విధంగా చర్య లు తీసుకుంది. దీంతో ఈ కాలనీల్లో పనులు చేయడంపై కూటమి చిన్న చూపు చూస్తోంది. కాలనీల్లో వసతులు కల్పిస్తే, ఆ పేరు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ప్రభుత్వానికి దక్కుతుందని కూటమి పాలకులు ఈ కాలనీలను నిర్లక్ష్యం చేస్తున్నారని కాలనీల వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
స్పందించని ప్రభుత్వం..


