కవిటి: బొరివంకలో వెలసిన శ్రీకాళీమాత అమ్మ వారి సంబర మహోత్సవాన్ని గ్రామానికి చెందిన శ్రీ కాళీమాత సన్నాయి మేళం సంఘం ఆధ్వర్యంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. అమ్మవారి సంబరాన్ని పురస్కరించుకు ని అమ్మవారి ప్రతిరూపంగా భావించే గజముద్దను మేళతాళాలతో బాణసంచా కాలుస్తూ నృత్యం చేస్తూ ఊరేగించారు. నాలుగు కాళీమాత వేషధారణలతో పాటు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు.
లైంగికదాడి నిందితుడిపై ముమ్మర దర్యాప్తు
కాశీబుగ్గ : ఓ యువతిపై అత్యాచారానికి ఒడిగట్టిన వ్యక్తిపై పోలీసులు ముమ్మర దర్యాప్తు చేస్తున్నారు. ఆమదాలవలసకు చెందిన నిందితుడు శ్రీకాకుళానికి చెందిన వివాహితకు పరిచయమయ్యాడు. ఆమె నుంచి రూ. 7లక్షల నగ దు కాజేశాడు. అంతటితో ఆగకుండా ఆ వివాహిత కుమార్తెతో చనువుగా వ్యవహరించి లైంగికదాడికి ఒడిగట్టాడు. శ్రీకాకుళం నుంచి కాశీబుగ్గకు ఆ యువతిని తీసుకువచ్చి ఈ దారుణానికి పాల్పడినట్లు తెలుస్తోంది. అయితే ఈ వ్యక్తి ఇదివరకే ఓ మోసపూరిత కేసులో అరెస్టయిన ట్లు తెలుస్తోంది. తాజాగా యువతిపై అత్యా చారానికి పాల్పడినట్లు ఫిర్యాదు రావడంతో కేసును కాశీబుగ్గ డీఎస్పీ భవానీకి అప్పగించినట్లు సమాచారం. పట్టణంలో ఓ భవనంలో నిందితుడిని ఉంచి రహస్యంగా దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది.
నాలుగు బెల్టు దుకాణాలపై కేసులు
పాతపట్నం: పాతపట్నం ఎకై ్సజ్ స్టేషన్ పరిధి లోని స్పెషల్ డ్రైవ్‌లో భాగంగా నాలుగు బెల్టు దుకాణాలపై దాడులు చేసి, నలుగురిపై కేసులు నమోదు చేశామని ఎకై ్సజ్ సీఐ కె.కృష్ణారావు ఆదివారం తెలిపారు. పాతపట్నం మండలంలోని నల్లబొంతు గ్రామంలో ఎజ్జి కృష్ణారా వు, సారవకోట మండలం గుమ్మపాడు గ్రా మంలో కత్తిరి లక్ష్మణరావు, కె గోవిందరావు, పెద్దలంబ గ్రామంలో బరాటం వెంకట రమణ వద్ద నుంచి 24 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకుని, వారిపై కేసులు నమోదు చేశామన్నారు. ఈ దాడుల్లో పాతపట్నం ఎకై ్సజ్, మొబైల్ పెట్రోలింగ్ టీం, శ్రీకాకుళం ఎన్‌ఫోర్స్‌మెంట్ టీం కలిసి స్పెషల్ డ్రైవ్ చేసి బెల్టు దుకాణాలపై దాడులు చేశామని తెలిపారు.
వాలీబాల్ లీగ్‌లో సిక్కోలు కుర్రాడికి జాక్‌పాట్
శ్రీకాకుళం న్యూకాలనీ: వాలీబాల్ క్రీడాకారులను ప్రోత్సహించాలనే ఆలోచనతో ఇండియన్ వాలీబాల్ ఫెడరేషన్ శ్రీకారం చుట్టింది. ఐపీఎల్ తరహాలానే వాలీబాల్ చాంపియన్స్ లీగ్ (వీసీఎల్) ఇండియా పేరిట కొంగొత్త ప్రొ లీగ్‌కు నడుం బిగించింది. త్వరలో జరిగే మొట్టమొదటి ఎడిషన్ (సీజన్–1) కోసం ఆదివారం అహ్మదాబాద్‌లో జరుగుతున్న వీసీఎల్ మెగా ఆక్షన్‌లో.. ప్లేయర్ల వేలం జరిగింది. ఈ వేలంలో శ్రీకాకుళం జిల్లాకు చెందిన వాలీబాల్ ప్లేయర్ మైలపల్లి సత్యం జాక్‌పాట్ కొట్టాడు. రణస్థలం మండలం కొవ్వాడకు చెందిన ఈ యువ సంచలనం అవుట్‌సైడ్ హిట్టర్‌గా గుర్తింపు పొందాడు. ఇదే అతని పాలిట వరంలా మారింది. 21 ఏళ్ల సత్యంకు రూ.5లక్షల బేస్ ప్రైజ్‌గా నిర్ణయించగా.. రూ.ఆరు లక్షలకు అయోధ్య గర్జన్ కొనుగోలు చేసింది. శ్రీకాకుళం జిల్లా నుంచి వాలీబాల్ లీగ్‌లో అమ్ముడైన మొట్టమొదటి ప్లేయర్‌గా సత్యం చరిత్ర సృష్టించాడు.
జిల్లాకు చెందిన శాప్ కోచ్ కల్లేపల్లి హరికృష్ణ పర్యవేక్షణలో గత దశాబ్దకాలంగా సత్యం రాటుదేరాడు. మైలపల్లి సత్యం వీసీఎల్ ఇండియా ప్రో వాలీబాల్ లీగ్‌కు ఎంపిక కావడంపై జిల్లా వాలీబాల్ అసోసియేషన్ అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్, కార్యదర్శి కె.రామచంద్రుడు, టి.రవి, యాళ్ల పోలినాయుడు, పి.సుందరరావు మాస్టారు, ఎంవీ రమణ, సతీష్, ఎన్‌వీ రమణ, డీఎస్‌డీఓ ఎ.మహేష్‌బాబు, కోచ్ కె.హరికృష్ణ, ఒలింపిక్ సంఘ జిల్లా కార్యదర్శి ఎం.సాంబమూర్తి, సంఘ ప్రతినిధులు, సీనియర్ క్రీడాకారులు హర్షం వ్యక్తం చేశారు.


