ఎండిపోతున్న వరి పంట
కాలువ లేని పొలాలు ఎలాగూ బీడు వారా యి. కాలువ పక్క పొలాలు కూడా చుక్క నీరు లేక నెర్రెలిచ్చిన దారుణ పరిస్థితులు దాపురించాయి. భైరిదేశి గెడ్డ శివారు ప్రాంతమైన కళింగపట్నం పొలాలకు సాగునీరు అందడం లేదు. ఒక పక్క ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు పూర్తిగా కురవని పరిస్థితి ఉంటే, వస్తున్న సాగునీరు కేవలం రాజకీయ నాయకుల సిఫారసుల మేరకు విడుదల చేస్తుండటంతో రైతులు ఆవేదన చెందుతున్నారు. భైరిదేశి గెడ్డ చానెల్ ద్వారా వస్తున్న సాగునీరు వమరవల్లి జంక్షన్ దాటి మహమ్మద్ రజాక్ చెరువుకు వచ్చి కళింగపట్నం పొలాలకు రావాల్సి ఉంది. కానీ శివారుకు నీరు మాత్రం రాలేదు. కళింగ పట్నం ప్రాంతాలకు సాగునీరు వెళ్లే అవకాశము న్నా టీడీపీ నాయకుల సిఫారసుతో నీరు రాకుండా చేస్తున్నారని రైతులు చెబుతున్నారు సంబంధిత ఏఈలకు ఫోన్ చేస్తే సాగునీటి సంఘం అధ్యక్షుడిని అడగాలని చెబుతుండటం గమనార్హం. – గార


