న్యూస్‌రీల్
ప్రదర్శనలు అదరహో..
స్వాతంత్య్ర వేడుకల్లో మంత్రి అచ్చెన్నాయుడు
ఆదివారం శ్రీ 16 శ్రీ ఆగస్టు శ్రీ 2026
జి.సిగడాం: సేతుభీమవరం వద్ద తోటపల్లి పిల్ల కాలువకు శనివారం గండిపడింది. జాడ ఫీడర్ చానల్ ద్వారా నీరు వృథాగా పోతుండటంతో రైతులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు.
శ్రీకాకుళం పాతబస్టాండ్ : స్వాతంత్య్ర సమరయోధుడు సర్దార్ గౌతు లచ్చన్న జయంతి పురస్కరించుకుని ఆదివారం జిల్లాలో అధికారికంగా వేడుకలు నిర్వహించనున్నట్లు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఉదయం 10 గంటలకు డే అండ్ నైట్ జంక్షన్ వద్ద ఉన్న సర్దార్ గౌతు లచ్చన్న విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పిస్తారని, అనంతరం సమీపంలోని అంబేడ్కర్ భవనంలో ప్రధాన సభ జరుగుతుందని వెల్లడించారు. ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజలు అధిక సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
జలుమూరు: రాష్ట్ర ఉత్తమ పాఠశాలగా కరవంజ మోడల్ స్కూల్ ఎంపికై ంది. ఈ సందర్భంగా శనివారం వియవాడలో సీఎం చంద్రబాబు చేతుల మీదుగా ప్రిన్సిపాల్ రఘుపాత్రుని శివకుమార్ అవార్డు అందుకున్నారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ మాట్లాడుతూ ఈ అవార్డు మరింత బాధ్యతను పెంచిందన్నారు. ఉపాధ్యాయుల సమష్టి కృషి, విద్యార్థుల సహకారంతోనే ఇది సాధ్యమైందన్నారు.
ఆమదాలవలస : వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు జైల్లో ఉన్న వారి కుటుంబ సభ్యులు అందరూ ఇలాంటి క్లిష్ట సమయంలోనే ధైర్యంగా ఉండాలని ఆమదాలవలస నియోజకవర్గ సమన్వయకర్త చింతాడ రవికుమార్ అన్నారు. పోలీస్ కస్టడీలో ఉన్న రవికుమార్‌ను శనివారం ఉదయం 9.30 గంటల సమయంలో జొన్నవలస సామాజిక ఆస్పత్రి వైద్యపరీక్షల నిమిత్తం తరలించారు. అనంతరం ఆమదాలవలస పోలీస్ స్టేషన్‌కు తీసుకువచ్చారు. అక్కడి నుంచి ఆమదాలవలస జ్యుడీషియల్ కోర్టుకు తీసుకువచ్చి జూనియర్ సవిల్ జడ్జి బి.రమ్య ఎదుట హాజరుపరిచారు. రవికుమార్‌ను విచారించిన తరువాత అంపోలు జైలుకు తరలించారు. ఈ సందర్భంగా తనను చూసేందుకు వచ్చిన పార్టీ శ్రేణులతో చింతాడ మాట్లాడుతూ ఎటువంటి తప్పు లేకపోయినా ప్రభుత్వం ఇబ్బందులకు గురిచేస్తోందని, ప్రజలు గమనించాలని కోరారు. మన ఐక్యతే మన బలమని, ధైర్యమే విజయ మని చెప్పారు. కాగా, ఇదే కేసులో అరెస్టయిన పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి బొడ్డేపల్లి రమేష్‌కుమార్, అన్నెపు సంజయ్, గురుగుబిల్లి చంద్ర, దానేటి రామ్మోహన్, ఇప్పిలి శివ, పోగోటి భానుప్రకాష్, కుసుమంచి హరీష్, ఖండాపు గోవిందరావు, సైరిగాపు శివ, మూడడ్ల రమణ, పైల చిన్నబాబు, చిగురుపల్లి రవికుమార్, చింతాడ గోదాకృష్ణలను కూడా వైద్య పరీక్షల నిమిత్తం జొన్నవలస ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకొచ్చారు. అనంతరం ఆమదాలవలస కోర్టులో హాజరుపరిచారు. విచారణ అనంతరం అంపోలు జైలుకు తరలించారు. వీరిని చూసేందుకు కుటుంబ సభ్యులు తరలివచ్చారు.
మువ్వన్నెల జెండా రెపరెపలాడింది. వేడుకలను
తిలకించేందుకు వచ్చిన వారిలో స్వాతంత్య్ర స్ఫూర్తిని
రగిలించింది. సమరయోధుల త్యాగాలను స్మరించుకుంటూ దేశ సమైక్యతను చాటిచెప్పేలా విద్యార్థులు ప్రదర్శించిన
సాంస్కృతిక ప్రదర్శన అబ్బురపరిచింది.
శ్రీకాకుళం పాతబస్టాండ్/శ్రీకాకుళం(పీఎన్ కాలనీ):
స్వాతంత్య్ర దినోత్సవ సంబరాలు అంబరాన్నంటాయి. జిల్లా అధికార యంత్రాంగం ఆధ్వర్యంలో నిర్వహించిన సాంస్కృతిక ప్రదర్శనలు ఆహూతులను అలరించాయి. వివిధ పాఠశాలలు, కళాశాలలకు చెందిన విద్యార్థులు ప్రదర్శించిన నృత్యాలు, దేశభక్తి గీతాలు, సాహస ఘట్టాలు వీక్షకులను మంత్రముగ్ధులను చేశాయి. జిల్లా కేంద్రంలోని శ్రీకాకు ళం ప్రభుత్వ డిగ్రీ పురుషుల కళాశాల మైదానం వేదికగా జరిగిన ఈ వేడుకల్లో ముందుగా మంత్రి అచ్చెన్నాయుడు త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించా రు. అనంతరం జిల్లా ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. గౌరవ వందనం స్వీకరించారు. కోటబొమ్మాళికి చెందిన స్వాతంత్య్ర సమరయోధుడి భార్య కోరాడ అమ్మాయమ్మను సత్కరించారు.
ఆకట్టుకున్న స్టాళ్లు
పశుసంవర్ధక, వ్యవసాయ, మత్స్య, ఉద్యాన, పట్టు పరిశ్రమ, సాంఘిక సంక్షేమ, మహిళా శిశు సంక్షేమ శాఖలతో పాటు ఏపీ ఎంఐపీ, జిల్లా గ్రామీణ అభివద్ధి సంస్థ, మెప్మా, విద్యాశాఖ, సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో స్టాళ్లు కొలువుదీరాయి. నీకో పవర్, ఆర్కే సోలార్, ఆక్వాకల్చర్, యూబీఐ ఆర్సెటీ సంస్థలు తమ నైపుణ్య, సాంకేతిక ప్రదర్శనలు నిర్వహించ గా.. ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ గ్యాలరీ, ఉచిత వైద్య శిబిరం, తాగునీటి స్టాళ్లు సందర్శకులకు అందుబాటులో నిలిచాయి.
శ్రీకాకుళం పాతబస్డాండ్: గడిచిన రెండేళ్లలో రూ.1.49 లక్షల కోట్లను ఖర్చు చేసి ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేశామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. శ్రీకాకుళం ప్రభుత్వ పరుషుల డిగ్రీ కళాశాల మైదానంలో శనివారం నిర్వహించిన 80వ స్వాతంత్య్ర వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సీ్త్ర శక్తి పథకం ద్వారా మహిళలకు ఇప్పటివరకు రూ.120 కోట్ల ఆర్థిక లబ్ధి చేకూరిందని, 3.04 లక్షల మందికి ప్రతి నెలా రూ.129.99 కోట్ల విలువైన ఎన్టీఆర్ భరోసా పింఛన్లు అందిస్తున్నామని పేర్కొన్నారు. తల్లికి వందనం కింద 2.54 లక్షల మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రూ.381.68 కోట్లు జమ చేశామని, దీపం–2 పథకంలో రూ.166 కోట్ల ఉచిత సిలిండర్ల సబ్సిడీ అందించామని వెల్లడించారు. అన్నదాత సుఖీభవ కింద 2.79 లక్షల మందికి రూ.183.61 కోట్లు బదిలీ చేశామని, మత్స్యకారులకు వేట నిషేధ భృతి కింద 16,738 మందికి రూ.32.38 కోట్లు అందించామని వివరించారు. పీఎం కిసాన్, రైతు భరోసా మిగిలిన వాయిదాల జమ పూర్తయిందని తెలిపారు. 3.24 లక్షల పాస్ పుస్తకాలు రైతులకు పంపిణీ చేశామన్నారు. వంశ ధార పనుల పురోగతి, ఆఫ్‌షోర్ నిర్మాణం పనులు పూర్తికి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఈ రిజర్వాయర్ ద్వారా 2027 నాటికి 26 వేల ఎకరాలకు సాగునీరు అందించేందుకు లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు. 4756 ఫీడర్ చానెళ్లను శుభ్రం చేయించామన్నారు. అనంతరం ఉత్తమ ఉద్యోగులకు ప్రశంసాపత్రాలు ప్రదానం చేశారు. కార్యక్రమంలో కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఎస్పీ కె.వి.మహేశ్వర్ రెడ్డి, జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్‌ఖాన్, అసిస్టెంట్ కలెక్టర్ హరి ఓం పాండియా, శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్, ఆయా శాఖల ఉన్నతాధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు.
స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా శనివారం నరసన్నపేటలోని వేంకటేశ్వర స్వామి ఆలయం, శ్రీకాకు ళం డీసీసీబీ కాలనీలోని వేంకటేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారిని మూడు రంగుల్లో ప్రత్యేకంగా అలంకరించారు.
– నరసన్నపేట/
శ్రీకాకుళం కల్చరల్
న్యూ సెంట్రల్ స్కూల్ విద్యార్థుల నృత్యం
వివిధ ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన శకటాల ప్రదర్శన ప్రత్యేక
ఆకర్షణగా నిలిచింది. విద్యాశాఖ, మున్సిపల్ కార్పొరేషన్, జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీఏ) శకటాలు తొలి మూడు స్థానాలు కై వసం చేసుకున్నాయి.
శ్రీకాకుళం మున్సిపల్ కార్పొరేషన్ శకటం (తృతీయ)
విద్యాశాఖ శకటం(ప్రథమ)
డీఆర్‌డీఏ వెలుగు శకటం(ద్వితీయ)
న్యూ సెంట్రల్ స్కూల్ విద్యార్థులు ‘జయ జయ భారత జనని’ రూపకం, ఆర్.సి.ఎం. ఎలిమెంటరీ స్కూల్ చిన్నారులు ‘ఇదే మన భారతం’ అభినయం, ఎచ్చెర్లలోని బి.ఆర్. అంబేడ్కర్ గురుకుల విద్యార్థులు ‘తిరంగా దేశ్ మేరే’ విన్యాసం, శ్రీ చైతన్య టెక్నో స్కూల్ విద్యార్థులు ‘భరత ఖండమే నాదేశం’ ప్రదర్శన, గీతాంజలి స్కూల్ విద్యార్థుల ‘కర్ర సాము’, పెద్దపాడు ఏపీఆర్‌ఎస్‌డబ్ల్యూ స్కూల్ విద్యార్థుల ‘వందేమాతరం’ నత్య రూపకం, సంప్రదాయ గిరిజన ‘థింసా’ నృత్యం, సెయింట్ పాల్స్ హైస్కూల్, బెహరా మనోవికాస్ కేంద్రం విద్యార్థుల ప్రదర్శనలు అబ్బురపరిచాయి. ఇందులో న్యూ సెంట్రల్ స్కూల్, బెహరా మనోవికాస కేంద్రం, గీతాంజలి పబ్లిక్ స్కూల్ విద్యార్థుల ప్రదర్శనలు తొలి మూడు స్థానాల్లో నిలిచి బహుమతులు గెలుచుకున్నాయి.


