ఆమదాలవలస: ఆమదాలవలస వైఎస్సార్ సీపీ నియోజకవర్గ సమన్వయకర్త చింతాడ రవికుమార్, మరో 26 మందిపై పోలీసులు పెట్టిన అక్రమ కేసులో రిమాండ్‌లో ఉన్న మరో 11 మందిని కోర్టు ఆదేశాల మేరకు ఆదివారం ఆమదాలవలస పోలీసులు తమ కస్టడీలోకి తీసుకున్నారు. మధ్యాహ్నం 12 గంటల సమయంలో బొడ్డేపల్లి శ్రీనివాసరావు, దుంపల శ్రీనివాసరావు, పొన్నాడ చిన్నారావు, చింతాడ రాఘవేంద్ర, సనపల తవిటయ్య, మొదలవలస మురళి, అన్నెపు కృష్ణ, చిగురుపల్లి గిరి, కూన ధర్మారావు, గురుగుబెల్లి నవీన్, చింతాడ యతీంద్రలను ఆమదాలవలస పోలీస్‌స్టేషన్‌లో విచారిస్తున్నారు.
తల్లి పాత్రలతో ప్రత్యేక గుర్తింపు
● సీనియర్ నటి ఈశ్వరిరావు
అరసవల్లి: గతంలో ఇంటింటా దీపావళి, రాంబంటు తదితర సినిమాల్లో హీరోయిన్‌గా పనిచేసినప్పటికీ.. ఇప్పుడు అగ్రతారలకు తల్లిగా మంచి పాత్రలను పోషించడం ద్వారా ప్రత్యేక గుర్తింపు లభిస్తోందని ప్రముఖ నటి ఈశ్వరిరావు అన్నారు. తొలిసారిగా అరసవల్లి సూర్యనారా యణ స్వామిని ఆమె ఆదివారం దర్శించుకున్నా రు. ఆలయ సిబ్బంది గౌరవ సంప్రదాయం ప్రకారం అంతరాలయ దర్శనం చేయించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ అరవింద సమే త వీర రాఘవ, సలార్, దర్బార్ తదితర సిని మాల్లో మంచి పాత్రలు దక్కాయన్నారు. భవిష్యత్‌లో మరిన్ని పాత్రలతో ప్రేక్షకులను మెప్పించే ప్రయత్నం చేస్తానన్నారు. బయటకు వస్తుంటే అందరూ తనను సలార్‌లో ప్రభాస్ తల్లి అంటుంటే చాలా ఆనందంగా ఉందన్నారు.
ఫిన్లాండ్‌లో అధ్యయనానికి నీరజ ఎంపిక
శ్రీకాకుళం: ఫిన్లాండ్‌లో ప్రపంచ స్థాయి బోధనా పద్ధతుల అధ్యయనానికి శ్రీకాకుళం ఎ.వి.ఎన్.(వరం) మున్సిపల్ కార్పొరేషన్ ఉన్నత పాఠశాల హిందీ ఉపాధ్యాయురాలు, రాష్ట్ర స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత తిమ్మ రాజు నీరజ ఎంపికై ంది. రాష్ట్ర స్థాయి ఉత్తమ ఉపాధ్యాయుల్లో 29 మందిని అంతర్జాతీయంగా విద్యా రంగంలో ప్రథమస్థానంలో ఉన్న ఫిన్లాండ్‌కు పంపి అక్కడి వినూత్న భోధన పద్ధతులను అధ్యయనం చేసేందుకు ప్రభుత్వం ఎంపిక చేసింది. ఈ నెల 17 నుంచి 28వ తేదీ వరకు ఫిన్లాండ్‌లో వీరు పర్యటిస్తారు.
ఇవేం బ్యాగులు
సారవకోట: ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ప్రభుత్వం అందించిన స్కూల్ బ్యాగులు నాసిరకంగా ఉంటున్నాయి. సారవకోట మండలానికి ఇటీవల వచ్చిన బ్యాగుల్లో కొన్నింటికి బెల్టుల జాయింట్ కుట్లు లేకుండా, మరికొన్ని క్లిప్‌లు, జిప్పులు లేకుండా ఉన్నాయి. దీంతో వీటిని విద్యార్థులకు ఇచ్చేందుకు ప్రధానోపాధ్యాయులు ఆసక్తి చూపించడం లేదు. దీంతో నాణ్యత లేని బ్యాగులను హెచ్‌ఎంలు తిరిగి ఎంఆర్‌సీకి తరలించారు. ఈ విషయమై ఎంఈఓ ఎం.వి.రమణ మాట్లాడుతూ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి మార్చేందుకు ప్రయ త్నిస్తున్నామన్నారు.
నమ్మండి..ఇది రోడ్డే!
కొత్తూరు: రాయల–బంకి రోడ్డు దమ్ముమడిని తలపిస్తోంది. ఈ ఏడాది మార్చిలో రూ.1.75 కోట్లుతో ఎన్‌ఆర్‌ఈజీఎస్ నిధులతో రోడ్డు పనులు ప్రారంభించారు. కొంత మేర పనులు జరిగిన తర్వాత ప్రభుత్వం నిధులు మంజూరు చేయకపోవడంతో కాంట్రాక్టర్ పనులు ఆపేశారు. అసంపూర్తిగా నిలిచిపోవడంతో కొద్దిపాటి వర్షానికే రోడ్డు బురదమయంగా మారుతోంది. దీంతో రాకపోకలకు ఆయా గ్రామాల ప్రజలు నరకయాతన అనుభవిస్తున్నారు.


