వారికైతే ఉపేక్ష.. వీరిపై కక్ష
● రోడ్డు ప్రమాదం కేసుని హత్య కేసుగా ఎలా చిత్రీకరిస్తారు
● వైఎస్సార్‌సీపీ సీనియర్ నాయకుడు, అడ్వకేట్ శిమ్మ రాజశేఖర్
● చంద్రబాబు ప్రభుత్వం దుర్నీతి
● పాతపట్నం ఎమ్మెల్యే కుమారుడు కారు ఢీకొట్టిన ఘటనపై నమోదు కాని హత్య సెక్షన్లు
● మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు కుమారుడు బైక్ ఘటనపై నేర పూరిత హత్య సెక్షన్లు నమోదు
● చర్చనీయాంశమైన టీడీపీ మంత్రులు, ఎమ్మెల్యేల తీరు
కంచిలి : బలియాపుట్టుగ కాలనీలో బుల్లి రథాలతో చిన్నారుల రథయాత్ర
శ్రీకాకుళంలో..
కంచిలిలో జగన్నాథ స్వామి రథయాత్ర
సీదిరి అప్పలరాజే టార్గెట్..
సీదిరి అప్పలరాజును ఎలాగైనా ఇరుకున పెట్టాలన్నది అధికార పక్ష తాపత్రయం. రోడ్డు ప్రమాదం జరిగితే నేరపూరిత హత్య సెక్షన్లు నమోదు చేయడం వెనుక ఆంతర్యం ఏమిటో అధికార పార్టీ నాయకులే చెప్పాలి. దర్యాప్తు పూర్తికాక ముందే తీవ్రమైన సెక్షన్లు నమోదు చేయడం వెనక రాజకీయ దురుద్దేశం ఉందని స్పష్టమైంది. అప్పలరాజును లక్ష్యంగా చేసుకుని కేసును మలుస్తున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. సీదిరి కుమారుడికి బెయిల్ కూడా దక్కకుండా ఉండేలా పావులు కదపడమే కాకుండా సీదిరి అప్పలరాజును అరెస్టు చేసి తీరాలన్న కసితో వెళ్తున్నారు. అంతా నిబంధనల ప్రకారమే అనుకుంటే.. కొరసవాడలో ఆటోను ఢీకొట్టి, ఒకరు మృతికి, మరో నలుగురికి గాయాలకు కారణమైన పాతపట్నం ఎమ్మెల్యే గోవిందరావు కుమారుడు సాయి గణేష్ కారు ఘటనపై అలాంటి నేర పూరిత హత్య సెక్షన్లు నమోదు చేశారా? అన్నది చెప్పాల్సిన బాధ్య త పోలీసులపైన, ప్రస్తుత పాలకులపైన ఉంది.
సమావేశంలో మాట్లాడుతున్న శిమ్మ రాజశేఖర్, చిత్రంలో పార్టీ నాయకులు
శ్రీకాకుళం (పీఎన్ కాలనీ): కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొలి రోజు నుంచి ఇచ్చిన హామీలను అమలు చేయకుండా వైఎస్సార్‌సీపీ నాయకులపై అక్రమ కేసులు పెట్టడమే పనిగా పెట్టుకున్నారని వైఎస్సార్‌సీపీ సీనియర్ నాయకుడు, న్యాయవాది శిమ్మ రాజశేఖర్ మండిపడ్డా రు. ఇటీవల పలాసలో ఈ నెల 10వ తేదీన జరిగిన రోడ్డు ప్రమాదాన్ని హత్యాయత్నంగా చిత్రీకరించే ప్రయత్నం చేయడం పోలీస్ వ్యవస్థకే మచ్చ తెచ్చేలా ఉందన్నారు. యాక్సిడెంట్ జరిగిన రోజు ఎఫ్‌ఐఆర్‌కి, ఆ తర్వాత రోజు ఇన్‌చార్జి మంత్రి వచ్చిన తర్వాత రోజుకి కాగితాల్లో రాతలు ఎలా మారిపోతాయన్నారు. ఆయన గురువారం శ్రీకాకుళంలో విలేకరులతో మాట్లాడారు. ఎఫ్‌ఐఆర్‌లో మార్పులు చేసి రాజకీయ దురుద్దేశంతో వ్యవహరించడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని మండిపడ్డారు. దమ్ముంటే రాజకీయంగా ఎదుర్కోవాలే తప్ప అక్రమ కేసులు పెడితే ఎవరూ బెదిరిపోయేది లేదన్నారు.
వైఎస్సార్‌సీపీ నగర అధ్యక్షులు సాధు వైకుంఠరావు, ఎంపీపీ గొండు రఘురాం, రూరల్‌మండల పార్టీ అధ్యక్షులు చిట్టి జనార్ధనరావు, మండవల్లి రవిలు మాట్లాడుతూ అధికారాన్ని అడ్డం పె ట్టుకుని ప్రతిపక్ష నాయకులను వేధించడం మా నుకోవాలని అన్నారు. సీదిరి మత్స్యకార కులానికి చెందినవారు కావడం వల్లే ఈ రకంగా వేధిస్తున్నా రన్నారు. చవకబారు రాజకీయాలు మానుకుని రాజ్యాంగబద్ధ పాలన అందించాలని కోరారు. ఈ సమావేశంలో మత్స్యకార సంఘ నాయకులు సూరాడ కన్నబాబు, మూగి రామారావు తదితరులు పాల్గొన్నారు.
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం:
దాదాపు ఏడాదిన్నర కిందట.. సరిగ్గా 2024 డిసెంబర్ 21న కొరసవాడ దగ్గర పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు తనయుడు సాయి గణేష్ కారు.. ఆటోను ఢీకొట్టడంతో, అందులో ప్రయాణిస్తున్న ఐదుగురికి తీవ్రగాయాలయ్యాయి. ఇందులో భామిని మండలం లివిరి గ్రామానికి చెందిన చెప్పల బోగయ్య అనే వ్యక్తి పరిస్థితి విషమంగా మారి, ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఇదే ఘటనలో ఈయన కోడలు చెప్పల సంతోషి, సవలాపురం నరేష్, గణేష్, ఆటో డ్రైవర్ కూర్మాన సునీల్‌కు గాయాలయ్యాయి. ఈ కేసుకు సంబంధించి మూడు రోజుల తర్జనభర్జనల తర్వాత, దర్యాప్తు పేరుతో కాలయాపన చేసి, చివరికీ ఎమ్మెల్యే తనయుడి కారును పల్లి రాజేష్ డ్రైవింగ్ చేసినట్టు కేసు నమోదు చేశారు. దీనిపై అనేక అనుమానాలు ఉన్నాయి. ప్రమాద సమయంలో మద్యం మత్తులో ఉన్నారని, ఎమ్మెల్యే కుమారుడే ప్రమాద సమయంలో డ్రైవింగ్ చేశాడని ఆరోపణలు వచ్చాయి. కానీ, చివరికి పల్లి రాజేష్ డ్రైవ్ చేసినట్టు పోలీసులు కేసు నమోదు చేసి, తేల్చేశారు.
ఈ ఘటనకు సంబంధించి అప్పట్లో చాలా మేనేజ్‌మెంట్ జరిగింది. కానీ ప్రతిపక్షం రాద్ధాంతం చేయలేదు. కావాలని ఎవరూ రోడ్డు ప్రమాదాలు చేయరనే కోణంలో రాజకీయం చేయలేదు. మొత్తానికి పోలీసులు పల్లి రాజేశ్ డ్రైవ్ చేశాడని నిర్ధారించి, కేసు నమోదు చేశారు. అంతే తప్ప నేర పూరిత హత్యగా సెక్షన్లు నమోదు చేయలేదు. అంతకుమించి అనుమానాలున్న మేరకు లోతుగా కేసు దర్యాప్తు కూడా చేయలేదు.
ప్రత్యర్థులకై తే మరొకటి..
ఇటీవల కాశీబుగ్గలో మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు కుమారుడు బైక్‌తో వెళ్తుండగా ప్రమాదవశాత్తు రోడ్డు ప్రమాదం జరిగిన గొర్రెల కాపరి దానయ్య మృతి చెందారు. యాక్సిడెంట్‌కు కారణమైనవారు తమకున్న పరిజ్ఞానం మేరకు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన దానయ్యకు సీపీఆర్ చేశారు. వెంటనే 108కి ఫోన్ చేశారు. ప్రమాద సమాచారం తెలుసుకున్న సీదిరి అప్పలరాజు వచ్చి పోలీసులకు సమాచారం అందించారు. అదే సమయంలో ఘటనలో గాయాలైన తన కుమారుడిని దగ్గరలో ఉన్న ఆస్పత్రికి తీసుకెళ్లారు. అంతవరకు బాగానే ఉన్నా తర్వాత రాజకీయం జోక్యం పెరిగిపోయింది. ఇంకేముంది కేసు బిగుసుకుంది. ఏకంగా హత్యా నేరాన్ని మోపారు. రోడ్డు ప్రమాదంతో రాజకీయ లబ్ధి పొందేందుకు ప్రయత్నించారు. పెదబాబు, చినబాబు దగ్గరి నుంచి, మంత్రులు, ఎమ్మెల్యేల వరకు రంగంలోకి దిగారు. ఎక్కడికక్కడ స్పందిస్తూ సీదిరి అప్పలరాజును టార్గెట్‌గా చేసుకుని ప్రెస్‌మీట్లు, ప్రకటనలు చేశారు. బాధిత కుటుంబాలకు అండగా ఉండటం తప్పు కాదు. విషాదంలో ఉన్న వారి కుటుంబాన్ని ఆదుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉంటుంది. ఆ దిశగా టీడీపీ ఎమ్మెల్యే, మంత్రులు స్పందించి, పరామర్శ, ఆర్థిక సాయం చేస్తే అంతా స్వాగతించారు. కానీ టీడీపీ నాయకులు ఇందులో కూడా రాజకీయం చూసుకున్నారు. రాష్ట్రంలో ప్రమాదాలకు గురైన వారందరి ఇళ్లకు వెళ్లి, ప్రత్యేకంగా పరామర్శ, ఆర్థిక సాయం చేసిన దాఖలాలు ఎక్కడా లేవు. కానీ, సీదిరి అప్పలరాజును లక్ష్యంగా చేసుకుని ఎమ్మెల్యే దగ్గరి నుంచి జిల్లా ఇన్‌చార్జి మంత్రి వరకు స్పందించడం చర్చనీయాంశమైంది. దీన్ని బట్టి రోడ్డు ప్రమాద ఘటనను ఎవరు రాజకీయాలకు వాడుకుంటున్నారో జనాలకు స్పష్టంగా అర్థమైంది.
మాజీ మంత్రి సీదిరిని వేధించడం సరికాదని వైఎస్సార్‌సీపీ లీగల్‌సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పిట్ట దామోదరరావు ఓ ప్రకటనలో తెలిపారు. రోడ్డు ప్రమాదానికి రాజకీయ రంగు పులిమి, రాజకీయ కక్ష సాధింపులకు పూనుకోవడం సమంజసం కాదన్నారు.


