సరుబుజ్జిలి: రాష్ట్రంలో రెడ్‌బుక్ రాజ్యాంగం నడుస్తోందని వైఎస్సార్ సీపీ ఆమదాలవలస సమన్వయకర్త చింతాడ రవికుమార్ అన్నారు. మంత్రి అచ్చెన్నాయుడు తప్పుడు వ్యాఖ్యలకు నిరసనగా ఆమదాలవలస పట్టణంలో కార్యకర్తలు, నేతల ఆధ్వర్యంలో రవికుమార్ శనివారం నిరసన ర్యాలీ చేసేందుకు సమాయత్తమయ్యారు. అయితే ర్యాలీ చేయకుండా పోలీసులు అడ్డుకుని అక్రమంగా అరెస్ట్ చేసి సరుబుజ్జిలి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. దీంతో నియోజకవర్గంలోని నాలుగు మండలాలకు చెందిన ఎంపీపీలు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీ సభ్యులు, పలువురు కార్యకర్తలు స్థానిక పోలీస్‌స్టేషన్ వద్దకు భారీగా తరలివచ్చారు. దీంతో పోలీసులు స్టేషన్‌లో రవికుమార్‌ను నిర్బంధించారు. దీంతో కార్యకర్తలు నిరసనలు తెలిపారు. అనంతరం రవికుమార్‌ను స్టేషన్ నుంచి పోలీసులు విడుదల చేశారు. ఈ సందర్భంగా రవికుమార్ మాట్లాడుతూ చనిపోయిన వ్యక్తులను తూలనాడుతూ ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్న మంత్రిని అదుపు చేయకుండా, శాంతి ర్యాలీ చేస్తున్న వారిపై లాఠీచార్జీలు చేసి, అక్రమ అరెస్ట్‌లు చేసి ఇతర మండలాల పోలీస్‌స్టేషన్‌కు తరలించడం ఎంతవరకు సమంజసమ ని ప్రశ్నించారు. ఈ ప్రభుత్వంలో ప్రశ్నించే గొంతుకలపై కత్తులు పెడుతున్నారని అన్నారు. నిజాలు మాట్లాడేవారిపై అక్రమ కేసులు బనాయించి జైళ్లలో పెట్టడం దుర్మార్గ పరిపాలనకు నిదర్శనమన్నారు. శాంతియుత మార్గాల్లో పయనిస్తున్న వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై పోలీస్ యంత్రాగం వ్యవహరించిన తీరు గర్హణీయమని ఎద్దేవా చేశారు.


