‘బలవంతంగా భూ సేకరణ’ | - | Sakshi
Sakshi News home page

‘బలవంతంగా భూ సేకరణ’

Apr 12 2026 2:42 AM | Updated on Apr 12 2026 2:42 AM

‘బలవంతంగా భూ సేకరణ’ అలరించిన నాటికలు రాష్ట్ర స్థాయి ఈఎండీపీ పోటీలకు ‘బ్లూమ్‌ బ్యాగ్‌’ ప్రాజెక్ట్‌

వజ్రపుకొత్తూరు రూరల్‌: కూటమి పాలనలో అభివృద్ధి పేరిట శ్రీకాకుళం జిల్లా నుంచి నెల్లూరు వరకు ఉన్న తీర ప్రాంతంతో పాటు ఏజెన్సీ ప్రాంతంలో రైతుల వద్ద ఉన్న భూమిని బలవంతంగా లక్షలాది ఎకరాలను సేకరిస్తున్నారని, రైతులు తిరగబడిన చోట వెనక్కి తగ్గుతున్నారని న్యూడెమోక్రసీ జిల్లా సహాయ కార్యదర్శి వంకల మాధవరావు అన్నారు. మండలంలో గల రిట్టపాడులో కామ్రేడ్‌ పైల వాసుదేవరావు 16వ వర్ధంతి కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన స్మారక స్థూపం వద్ద పూలమాలలు వేసి నివాళులర్పించారు. పాలకుల నిర్లక్ష్యంతో నిత్యావసర సరుకుల ధరలు పెరిగాయని, గ్యాస్‌ కొరత ఏర్పడిందని విమర్శించారు. ప్రజల కోసం 42 ఏళ్లు అజ్ఞాతంలో గడిపిన వాసుదేవరావు ఆశయాలను ఆదర్శంగా తీసుకోవాలన్నారు.

శ్రీకాకుళం కల్చరల్‌: ఉభయ తెలుగు రాష్ట్రాల నాల్గో ఆహ్వాన నాటిక పోటీలు శనివారం రెండో రోజు అలరించాయి. జిల్లా కేంద్రంలోని బాపూజీ కళామందిర్‌లో ఈ పోటీలు జరుగుతున్నాయి. విశాఖపట్నంకు చెందిన తెలుగు కళా సమితి చలసాని కృష్ణ ప్రసాద్‌ దర్శకత్వంలో, శ్రీకాకుళం నగరానికి చెందిన అట్టాడ అప్పలనాయుడు రచన, నాటకీకరణలో వచ్చిన ‘చిటికెన వేలు’ అబ్బురపరిచింది. మారిన పరిస్థితుల వల్ల గిరిజనులు పడుతున్న ఇబ్బందులను కళ్లకు కట్టినట్టు చూపించారు. విజయవాడకు చెందిన శ్రీకృష్ణ తెలుగు థియేటర్‌ ఆర్ట్స్‌ వారి ‘మరో పుత్తడి బొమ్మ’ సాంఘిక నాటిక కూడా ఆకట్టుకుంది. నేడు కాకినాడకు చెందిన బీవీ క్రియేషన్స్‌ వారి ‘కన్నీటికి విలువెంత’, విజయవాడకు చెందిన హర్ష క్రియేషన్స్‌ వారి ‘చెరిగిపోని చిరునామా’ నాటికలు ప్రదర్శించనున్నారు.

వజ్రపుకొత్తూరు రూరల్‌: వజ్రపుకొత్తూరు మండలం నగరంపల్లి జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశా ల విద్యార్థులు కె.నీరజ, కె.చైతన్య, ఎన్‌.రిషిత్‌ లు సైన్స్‌ ఉపాధ్యాయులు కొయ్యిల శ్రీనివాసరావు మార్గదర్శకత్వంతో రూపొందించిన ‘బ్లూమ్‌ బ్యాగ్‌’ ప్రాజెక్ట్‌ రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికై ంది. జిల్లా కేంద్రంలో గల ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో శనివారం వ్యవస్థాపక మనస్తత్వ అభివృద్ధి (ఈఎండీపీ) కార్యక్రమం నిర్వహించారు. జిల్లా స్థాయిలో నిర్వహించిన ఈ ఎగ్జిబిషన్‌ పోటీలలో విద్యార్థులు ఉత్తమ ప్రాజెక్ట్‌ను ప్రదర్శించి తృతీయ స్థానంలో నిలిచి రాష్ట్ర స్థాయి ప్రదర్శన పోటీల కు అర్హత సాధించారు. దీంతో డీఈఓ ఎ.రవిబాబు, జిల్లా సైన్స్‌ అధికారి ఎన్‌.కుమారస్వా మి, ఈఎండీపీ జిల్లా మేనేజర్‌ అనూష చేతుల మీదుగా విద్యార్థులు, సైన్స్‌ ఉపాధ్యాయులు శ్రీనివాసరావు బహుమతితో పాటు ప్రశంసా పత్రాలను అందుకున్నారు. ఈ మేరకు పాఠశాల ప్రధానోపాధ్యాయులు టి.హేమారావు, ఉపాధ్యాయ సిబ్బంది అభినందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement