శ్రీకాకుళం అర్బన్: జిల్లా కేంద్రంలోని ప్రధాన తపాలాశాఖ కార్యాలయంలో పార్సిల్ ప్యాకేజీ సెంటర్‌ను పోస్టర్ సూపరింటెండెంట్ వండాన హరిబాబు శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మన రాష్ట్రం, దేశమే కాకుండా విదేశాలకు సైతం తపాలాశాఖ ద్వారా పార్సిళ్లను పంపించుకోవచ్చన్నారు. వ్యాపారులు, వినియోగదారులు మెటీరియల్ తెచ్చుకుంటే తపాలా సిబ్బందే బాక్స్‌లో ప్యాకేజీని చేస్తారని, ఇందుకు తగిన రుసుం మాత్రం చెల్లించాల్సి ఉంటుందన్నారు. జిల్లాలో పార్శిల్ ప్యాకేజీ కౌంటర్‌లను ప్రధాన తపాలా కార్యాలయంతో పాటు శ్రీకాకుళం కోర్టు ప్రాంగణం, సోంపేట, కాశీబుగ్గ, పలాస, టెక్కలి, ఆమదాలవలస, రాజాంలలో ఏర్పాటు చేశామన్నారు. జిల్లాలో 19 చోట్ల ఆధార్ అప్‌డేషన్ కేంద్రాలను ప్రారంభించామని చెప్పారు. కార్యక్రమంలో పోస్ట్‌మాస్టర్ పడాల రంగారావు, అసిస్టెంట్ పోస్ట్ మాస్టర్ నూలు భానోజీరావు, తపాలాశాఖ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.


