కంచిలి: ఒడిశా నుంచి రెండు కావుళ్లతో నాటుసారా రవాణా చేస్తున్న ఇద్దరిని సోంపేట ప్రొహిబిషన్, ఎకై ్సజ్ సిబ్బంది, ఎన్‌ఫోర్స్‌మెంట్ సిబ్బంది శుక్రవారం అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 60 లీటర్ల సారాను స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన వారిలో ఒడిశా రాష్ట్రం తుంబగడకి చెందిన భాస్కర్ కార్జీ, కృష్ణ సబర్ ఉన్నారు. వీరిని సోంపేట మెజిస్ట్రేట్ ముందు హాజరుపర్చగా 14 రోజుల రిమాండ్ విధించారు. వీరి వాంగ్మూలం ద్వారా కంచిలి మండలం దొలాయిసాయి గ్రామానికి చెందిన చైతన్య భుయ్యాపై కూడా కేసు నమోదు చేశారు. ఈ సందర్భంగా సోంపేట సీఐ జి.వి.రమణ మాట్లాడుతూ ఒడిశా నుంచి సారా రవాణా జరగకుండా ప్రత్యేక కార్యాచరణ రూపొందించామని చెప్పారు. ఈ దాడుల్లో సోంపేట సీఐతో పాటు ఎన్‌ఫోర్స్‌మెంట్ సీఐ శ్రీనివాస్, ఎస్‌ఐలు సుజాత, జగన్నాథ్, సిబ్బంది విజయ్, రమణ, గాలిబ్, వెంకటేష్, ఉమాపతి, మార్కారావు పాల్గొన్నారు.


