చిన్న సినిమా.. పెద్ద విజయం | - | Sakshi
Sakshi News home page

చిన్న సినిమా.. పెద్ద విజయం

Aug 6 2023 1:40 AM | Updated on Aug 6 2023 11:11 AM

- - Sakshi

శ్రీకాకుళం అర్బన్‌: బేబి చిత్ర యూనిట్‌ శనివారం సిక్కోలులో సందడి చేసింది. శ్రీకాకుళంలోని సరస్వ తి థియేటర్‌కు యూనిట్‌ రాగా థియేటర్‌ మేనేజర్‌ చిన్నరాజు సాదర స్వాగతం పలికారు. హీరో ఆనంద్‌ దేవరకొండ, హీరోయిన్‌ వైష్ణవి చైతన్య, దర్శకుడు సాయి రాజేష్‌లు ప్రేక్షకులు, అభిమానులతో మా ట్లాడారు. సినిమాలోని డైలాగ్‌ను ఆనంద్‌ దేవరకొండ చెప్పడంతో ప్రేక్షకులు చప్పట్లు, ఈలలతో హాల్‌ను హోరెత్తించారు. హీరో, హీరోయిన్లు మాట్లాడుతూ చిన్న సినిమా అయినా ప్రేక్షకులు పెద్ద హిట్‌ చేసి ఆదరించిన తీరు ఎంతో ఆనందం కలిగించిందన్నారు.

దర్శకుడు సాయి రాజేష్‌ మాట్లాడుతూ కథలో కంటెంట్‌ ఉంటే ఎంతటి చిత్రాన్నైనా ప్రేక్షకులు ఆదరిస్తారని నిరూపించారన్నారు. ముఖ్యంగా సిక్కోలు వాసులు తన చిత్రాలను ఆదరించడం ఎన్నటికీ మరచిపోలేనన్నారు. ఈ రోజు వరకూ బేబి చిత్రం రూ. 87 కోట్లు వసూలు చేసిందన్నారు. తన గత చిత్రాలను కూడా సిక్కోలు వాసులు ఆదరించా రని గుర్తు చేసుకున్నారు.

తాను నిర్మాతగా, సుమన్‌ అనే వ్యక్తి దర్శకత్వంలో ఒక సినిమా నిర్మించనున్న ట్లు తెలిపారు. ఈ సినిమాకు ఇన్‌స్ట్రాగామ్‌లో పరిచ యమైన హారికా అనే అమ్మాయిని హీరోయిన్‌గా తెలుగు తెరకు పరిచయం చేయనున్నట్లు పేర్కొన్నా రు. తన చిత్రాల ద్వారా సంపూర్ణేష్‌బాబు, సుహాన్‌ లు ఓ స్థాయిలో హీరోలుగా నిలదొక్కుకున్నారన్నా రు. శ్రీకాకుళం యాసతో ఈ జిల్లాలోనే పూర్తిస్థాయి లో షూటింగ్‌ జరుపుకొని సినిమాను నిర్మిస్తానని తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement