బాలల హక్కుల పరిరక్షణకు కృషి | - | Sakshi
Sakshi News home page

బాలల హక్కుల పరిరక్షణకు కృషి

Nov 13 2026 12:16 AM | Updated on Nov 13 2026 12:16 AM

గార: బాలల హక్కుల పరిరక్షణకు గ్రామస్థాయిలోనే సమష్టి కృషి అవసరమని కేంద్ర ప్రభుత్వ ప్రత్యేక పరిశీలన బృంద సభ్యుడు ఎస్‌కే శర్మ అన్నారు. బోరవానిపేట పంచాయతీ ఛైల్డ్‌ ఫ్రెండ్లీ పంచాయతీగా కేంద్ర ప్రభుత్వం నిర్వహించే పోటీలకు రాష్ట్రం నుంచి నామినేట్‌ కావడంతో గురువా రం బృందం పంచాయతీలో పర్యటించింది. ముందుగా ప్రైమరీ పాఠశాలలో ఏర్పాటు చేసిన స్టాళ్లను సందర్శించింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాలల సమగ్ర అభివృద్ధికి విద్య, ఆరోగ్యకరమైన పోషకాహారం కీలకమని అన్నారు. బోరవానిపేట గ్రామం బాలల సంక్షేమ కార్యక్రమాల అమలులో ఆదర్శంగా నిలిచి జాతీయ స్థాయిలో గుర్తింపు సాధించాలని ఆకాంక్షిస్తున్నామని తెలిపారు. ప్రభుత్వ పాఠశాల, అంగన్‌వాడీ కేంద్రంలో మౌలిక సదుపాయాలు, విద్యార్థుల హాజరు, పౌష్టి కాహార పంపిణీ, వ్యాధినిరోధక టీకాలు అమలు, రక్తహీనత నివారణ, మరుగుదొడ్లు వాడకంపై పరిశీలించారు. ఈ సందర్బంగా గ్రామ సభ నిర్వహించి, పంచాయతీ కార్యాలయంలో రికార్డులు పరిశీలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement