మళ్లీ మారిందహో..! | - | Sakshi
Sakshi News home page

మళ్లీ మారిందహో..!

Nov 13 2026 12:16 AM | Updated on Nov 13 2026 12:16 AM

నేడు విలవిలనరసన్నపేట మహిళా మార్ట్‌ మూతబడింది. గత ప్రభుత్వ పాలనలో ఇది లాభాల బాటలో నడిచింది. –8లో శత్రుశర్ల మృతిపై ధర్మాన సోదరుల సంతాపం ఆలయ భూముల సారంపై నమూనాల సేకరణ

న్యూస్‌రీల్‌

శ్రీకాకుళం
నేడు విలవిలనరసన్నపేట మహిళా మార్ట్‌ మూతబడింది. గత ప్రభుత్వ పాలనలో ఇది లాభాల బాటలో నడిచింది. –8లో
పంచాయతీ ఎన్నికల విడతల్లో మళ్లీ మార్పులు

● 904 పంచాయతీలకు ఈ నెల 26, 29, డిసెంబర్‌ 2న పోలింగ్‌కు ఏర్పాట్లు

● మొదటి విడతలో 194, రెండో విడతలో 386,

మూడో విడతలో 324 పంచాయతీలకు పోలింగ్‌

అంటూ కొత్త జాబితా విడుదల

● నేడు విడుదల కానున్న పంచాయతీల

ఎన్నికల నోటిఫికేషన్‌

● గుండ అప్పలసూర్యనారాయణ విగ్రహావిష్కరణలో టీడీపీ రాజకీయం

● కార్పొరేషన్‌ ఎన్నికల నేపథ్యంలో ఆదరాబాదరాగా గుండ విగ్రహావిష్కరణ

● విగ్రహ తయారీపై వెల్లువెత్తుతున్న విమర్శలు

శుక్రవారం శ్రీ 13 శ్రీ నవంబర్‌ శ్రీ 2026

నరసన్నపేట: మాజీ మంత్రి శత్రుశర్ల విజయరామరాజు మృతిపై మాజీ డిప్యూటీ సీఎం, వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్‌, మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు సంతాపం వ్యక్తం చేశారు. విశాఖలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో శుత్రుచర్ల చికిత్స పొందుతూ మర ణించినట్లు తెలియడంతో ఆయనతో ఉన్న సా న్నిహిత్యాన్ని గుర్తు చేసుకున్నారు. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు. ఆయన కుటుంబానికి ప్రగాడ సానుభూతిని తెలిపారు.

పాతపట్నంలో విషాద ఛాయలు

పాతపట్నం: మాజీ మంత్రి శుత్రుచర్ల విజయరామరాజు(78) అనారోగ్యంతో విశాఖపట్నంలో ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురు వారం సాయంత్రం మృతి చెందారు. ఆయన ఆరు సార్లు ఎమ్మెల్యేగా, మూడు సార్లు ఎంపీగా, ఒక సారి ఎమ్మెల్సీగా, మంత్రిగా ప్రజలకు సేవలు అందించారు. పాతపట్నం నియోజకవర్గంలో తనదైన శైలిలో ప్రజలకు ఎనలేని సేవలు అందించారు. విజయరామరాజు మృతిపై వైఎస్సార్‌సీపీ రాష్ట్ర క్రమ శిక్షణ కమిటీ సభ్యురాలు, పాతపట్నం మాజీ ఎమ్మెల్యే రెడ్డి శాంతి సంతాపం తెలియజేశారు.

అరసవల్లి: ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అరసవల్లి సూర్యనారాయణ స్వామి ఆలయ పరిసరాల్లో భూముల సారాన్ని పరీక్షించే ప్రక్రియ మొదలైంది. ఇటీవల ప్రైవేటు భూ యజమానుల నుంచి 1.22 ఎకరాల భూములను ఆలయ అధికారులు ల్యాండ్‌ టు ల్యాండ్‌ విధానంలో బదలాయింపు చర్యలు చేపడుతున్నారు. ఈ క్రమంలో ఈ భూముల్లో కేంద్ర టూరిజం శాఖ ఆధ్వర్యంలో స్వదేశ్‌ దర్శన్‌ పేరిట రూ.55.75 కోట్ల వరకు నిధులు మంజూరు చేసిన సంగతి విదితమే. ఈ మేరకు ఈ నిధులతో అన్నదాన సత్రం, వసతగదుల నిర్మాణాలతో పాటు సూ ర్యదర్శన్‌ మ్యూజియం నిర్మాణ పనులను చేపట్టాలని టూరిజం శాఖ ప్రతిపాదించి తగిన ప్లాన్‌లను సిద్ధం చేసింది. అయితే ఇందుకు గాను ఈ పరిసరాల భూముల సారం సరిపడుతుందా లేదా అన్న సాంకేతిక కారణాల ఫలితాల కోసం సాయిల్‌ టెస్ట్‌లు నిర్వహించింది. ఇప్పటికే మూడు స్థలాల్లో శాంపుల్స్‌ కలెక్ట్‌ చేశామని జిల్లా పర్యాటక శాఖాధికారి ఎన్‌.నారాయణరావు తెలియజేశారు.

మార్పులు గమనించి సహకరించండి: కలెక్టర్‌

నరసన్నపేట: శ్రీకాకుళం పురపాలక సంఘం, ఆమదాలవలస మున్సిపాలిటీ ఎన్నికల షెడ్యూల్‌ రావడంతో పంచాయతీ ఎన్నికలు నిర్వహించే మండలాలను ఇంతకు మందు ప్రకటించిన ఫేజుల్లో స్వల్ప మార్పులు చేశామని కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌ అన్నారు. వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొనేందుకు గురువారం సాయంత్రం నరసన్నపేట తహసీల్దార్‌ కార్యాలయానికి వచ్చిన కలెక్టర్‌ మాట్లాడారు. ఫేజ్‌ –1, ఫేజ్‌–2, ఫేజ్‌–3 ల్లో జరగనున్న మండలాల పేర్లును మార్పు చేశా మని పేర్కొన్నారు. ఇప్పటి వరకూ పలాస, ఇచ్ఛాపురం మున్సిపాలిటీలతో పాటు పరిషత్‌ ఎన్నికలు జిల్లాలో ప్రశాంతంగా జరిగాయని పంచాయతీ ఎన్నికలు, శ్రీకాకుళం, ఆమదాలవలస మున్సిపాలిటీ ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు రాజకీయ పార్టీలు, అభ్యర్థులు సహకరించాలని కోరారు.

అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలకు ఉద్దానం వాసి

వజ్రపుకొత్తూరు: 2027–28 ఏపీ అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలకు ఉద్దానం ప్రాంతానికి చెందిన జోలింగి మానస ఎంపికయ్యా రు. మండలంలోని అక్కుపల్లి గ్రామానికి చెందిన మానస అస్సోం లో జన్మించింది. అక్కడే ప్రాథమిక విద్య, డిగ్రీ పూర్తి చేసి అనంతరం ఉన్నత చదువుల కోసం విజయవాడ వచ్చారు. ప్రస్తుతం పోటీ పరీక్షలకు సమాయత్తం అవుతూ అక్కుపల్లిలో ఉంటూ ఎంఏ ఎకనామిక్స్‌ అభ్యసిస్తున్నారు. ఆమె సొంతంగా వివిధ యూనివర్సిటీల్లో సెమినార్‌లు, ఇతర రంగాల మాక్‌ టెస్ట్‌ పోటీల్లో అసాధారణ ప్రతిభ కనబరిచారు. ఉద్దానం ప్రాంత పరిస్థితులు, ఆర్థిక అంశాలపై పూర్తి అవగాహన ఉంది. దీంతో ఆమె అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలకు అర్హత సాధించినట్లు ఆమె సంరక్షకులు డాక్టర్‌ జోలింగ్‌ తాతారావు తెలిపారు.

మొదటి విడతలో ఈ నెల 26న (194)

ఇచ్ఛాపురం (21), కంచిలి (31), కవిటి (23), సోంపేట (23),

పలాస ( 18), మందస (41), వజ్రపుకొత్తూరు (37)

రెండో విడత ఈ నెల 29న (386)

ఎచ్చెర్ల (26), జి.సిగడాం (31), లావేరు (26), రణస్థలం (34),

ఆమదాలవలస (30), బూర్జ ( 30), పొందూరు ( 29), సరుబుజ్జిలి (21), కొత్తూరు (43), హిరమండలం (23), ఎల్‌ఎన్‌.పేట (22), మెళియాపుట్టి ( 37), పాతపట్నం ( 34)

మూడో విడతలో డిసెంబర్‌ 2న (324)

నరసన్నపేట (34), పోలాకి (31), సారవకోట ( 35), జలుమూరు

( 40), శ్రీకాకుళం (23), గార (25), టెక్కలి ( 27),

కోటబొమ్మాళి (38), సంతబొమ్మాళి (34), నందిగాం (37)

అరసవల్లి: గ్రామ పంచాయతీల ఎన్నికల ప్రక్రియలో ముచ్చటగా మూడోసారి మార్పు జరిగింది. ముందుగా ప్రకటించిన పోలింగ్‌ తేదీలను తాజాగా మార్చారు. ఇప్పటికే పరిషత్‌ ఎన్నికల నిర్వహణలో యంత్రాంగం నిర్వాకాలపై తీవ్ర విమర్శలు ఎదురైన వేళ.. తాజాగా పంచాయతీ ఎన్నికల షెడ్యూల్‌ మార్పులపై జిల్లా యంత్రాంగం మళ్లీ విమర్శలు ఎదుర్కొంటోంది. ఇలా వరుసగా మార్చేస్తుండడంపై వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్‌ తీవ్రంగా అభ్యంతరాన్ని వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. అయినప్పటికీ మరోసారి పంచాయతీల విడతల వారీగా మార్పులు చేయడం వెనుకున్న మ తలబు ఏమిటో ఎవరికీ అర్థం కావడం లేదు.

ముచ్చటగా మూడోసారి

జిల్లాలో తొలుత 910 పంచాయతీల ఎన్నికలకు సంబంఽధించి పల్లె సంగ్రామానికి జిల్లా ఎన్నికల యంత్రాంగం సన్నాహాలు చేసింది. తర్వాత కోర్టు కేసుల పుణ్యమా అని 901 గ్రామ పంచాయతీలకే ఎన్నికలన్నారు. మళ్లీ తాజాగా 904 పంచాయతీల్లో పోలింగ్‌ అంటూ నిర్ణయాన్ని ప్రకటించారు. అయితే ఈ మేరకు మొదటి విడతగా ఈ నెల 26న, రెండో విడతగా ఈనెల 29న అలాగే మూడో విడతగా డిసెంబర్‌ 2న ఆయా పంచాయతీలకు పోలింగ్‌ నిర్వహించేలా షెడ్యూల్‌ను విడుదల చేశారు. అయితే ఈ మూడు విడతల్లో పోలింగ్‌ నిర్వహించాల్సిన మండలాల పేర్లను ఇప్పటికి మూడు సార్లు మార్పులు చేయడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మొదటి విడతలో 232, రెండో విడ తలో 347, మూడో విడతలో 331 పంచాయతీలకు పోలింగ్‌ జరుగనున్నట్లుగా గత నెల 14న జాబితాను ప్రకటించారు. మధ్యలో కార్పొరేషన్‌ ఎన్నికలకు గ్రీన్‌సిగ్నల్‌ రావడంతో గ్రామ పంచాయతీల ఎన్నికల్లో మొదటి విడతలో 224, రెండో విడతలో 347, మూడో విడతలో 330 పంచాయతీలకు పో లింగ్‌ జరుగుతుందని ఈనెల 9న జిల్లా కలెక్టర్‌ ప్రకటించారు. మళ్లీ వెంటనే ఈ షెడ్యూల్‌ కూడా మార్చేస్తూ.. మొదటి విడతలో 197, రెండో విడతలో 303, మూడో విడతలో 401 పంచాయతీలకు పోలింగ్‌ అవుతుందంటూ ఈనెల 11న మరో అధి కారిక ప్రకటన విడుదల చేశారు. మళ్లీ ఇప్పుడు ఆ జాబితా కూడా తూచ్‌.. అంటూ మార్చేశారు. తాజాగా గురువారం రాత్రి ప్రకటించిన షెడ్యూల్‌ ప్రకారం తొలివిడతలో 7 మండలాల్లోని 194, రెండో విడతలో 13 మండలాల్లోని 386, మూడో విడతలో 10 మండలాల్లోని 324 పంచాయతీల్లో మొ త్తం 8702 పోలింగ్‌ కేంద్రాల్లో పోలింగ్‌ జరుగుతుందని అధికారికంగా ప్రకటించారు. ఇప్పటికే పరిషత్‌ ఎన్నికల్లో జిల్లా ఎన్నికల యంత్రాంగం ఇష్టానుసారంగా అధికార పార్టీల నిర్ణయాలకు తలొగ్గి.. ఆ నేతల ఆదేశాల సూచనల మేరకే పరిషత్‌ ఎన్నికల ను నిర్వహించి.. ఏకంగా ప్రత్యర్థులు గెలిచిన స్థానా లను సైతం అధికార పార్టీల ఖాతాల్లోకి వేసేంతలా పనిచేసింది. ఇప్పుడు కూడా గ్రామ పంచాయతీల ఎన్నికల విషయంలోనూ ఇలాంటి ప్రయత్నాలే జ రుగుతున్నాయనే అనుమానాలు వ్యక్తమవుతున్నా యి. జిల్లాలో శ్రీకాకుళం నగర పాలక సంస్థతో పాటు ఆమదాలవలస మున్సిపల్‌ ఎన్నికలకు గురువారం నోటిఫికేషన్‌ రావడంతోనే మార్పులు చేశా మని అధికారులు చెబుతున్నారు. కాగా పంచాయతీల ఎన్నికలకు శుక్రవారం నోటిఫికేషన్‌ విడు దల కానుంది. అయితే కోర్టు కేసుల కారణంగా నిన్నటి వరకు పోలింగ్‌ ఏర్పాట్లకు దూరంగా ఉన్న 9 పంచాయతీల్లో రణస్థలం మండలంలోని రావా డ, వెంకట్రాయపేట, వల్లభరావు పేటలలో పోలింగ్‌ జరగనుంది. లావేరు మండలంలోని బెజ్జిపురం, కె.సిగిరిపల్లి, తామాడ, కొత్తకుంకాం, పైడివలసతో పాటు పలాస మండలం లొద్దబద్రలో మాత్రం పోలింగ్‌కు కోర్టు కేసు పెండింగ్‌ సమస్య కారణంగా తాత్కాలికంగా ఎన్నికలకు దూరంగా ఉండనున్నాయి.

‘శాంతియుత ఎన్నికలకు సహకరించాలి’

శ్రీకాకుళం క్రైమ్‌ : జిల్లావ్యాప్తంగా త్వరలో నిర్వహించనున్న గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా పారదర్శకంగా, ప్రశాంతంగా జరిగేలా ప్రతి ఒక్కరూ సహకరించాలని ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి కోరారు. ఎన్ని కల నియమావళిపై గ్రామ ప్రజలకు, యువతకు విస్తృత స్థాయిలో అవగాహన కల్పించాలని అధికారులను ఎస్పీ ఆదేశించారు. పోలీసులు సంబంధిత స్టేషన్ల పరిధి గ్రామాలను సందర్శించి ప్రజలతో సమావేశాలు నిర్వహించాలన్నారు. ఈ సందర్భంగా నామినేషన్ల దాఖలు ప్రక్రియ నుంచి పో లింగ్‌, ఓట్ల లెక్కింపు, ఎన్నికల ఫలితాల ప్రకటన వరకు ప్రతీ ఒక్కరూ ఎన్నికల నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు.

అరసవల్లి: గత 45 ఏళ్లుగా అరసవల్లి కేంద్రంగానే శ్రీకాకుళం నియోజకవర్గ రాజకీయాలు జరిగాయి. ఇదే అర్బన్‌ గ్రామానికి చెందిన రాజకీయ ఉద్ధండులు ఇక్కడే గెలిచారు.. ఓడారు కూడా. కానీ ఎప్పుడూ కేసులు గానీ గొడవలు గానీ జరగలేదు. అలాంటి ప్రశాంతతకు మారుపేరైన అరసవల్లి అర్బన్‌ గ్రామ పరిసరాలకు ఇప్పుడు పోలీసులు వస్తున్నారు. నగర పాలక సంస్థ ఎన్నికల్లో భాగంగా పోలీసులు ముందస్తుగా అరసవల్లి ఇంటి గుమ్మాలకు రావడం, సుమారు 20 మందికి పైగా యువకులపై (ఇరు ప్రధాన పార్టీలకు చెందిన) బైండోవర్‌ కేసులు నమోదు చేయడం, పలు వీధులకు చెందిన కుటుంబ పెద్దలపై కూడా తప్పుడు కేసులకు సిద్ధమవుతున్న నేపథ్యం స్థానికంగా తీవ్రంగా చర్చనీయాంశమైంది. గురువారం కార్పొరేషన్‌ ఎన్నికలకు నోటిఫికేషన్‌ రావడం, ఈ నెల 26న మేయర్‌తో పాటు కార్పొరేటర్ల పోలింగ్‌, 30న కౌంటింగ్‌ ప్రక్రియ కూడా జరగనుండడంతో నగర వ్యాప్తంగా రాజకీయ సందడి నెలకొంది. ఈ నేపథ్యంలో అరసవల్లి ప్రాంతంలో గతంలో ఎన్నడూ జరగని విధంగా ముందస్తు అరెస్టులు, కేసుల న మోదు వంటివి ఎదురు కాకుండా ఉండేలా గ్రామపెద్దలు (రాజకీయ నేపథ్యం లేనివారు) గట్టి నిర్ణయానికి వచ్చారు. ఎన్నికల సమయంలో గెలుపు ఓటములు మాత్రమే ఉండాలని, ఎలాంటి కక్ష సాధింపులు ఉండకూడదని నిర్ణయించారు. ఎన్నికల తర్వాత అంతా కలిసి ఉండేలా బంధాలను కొనసాగే వాతావరణం ఎప్పటికీ ఉండాలనేలా గ్రామపెద్దలు ఆలోచన చేశారు. ఇందుకు కార్యరూపంగా అరసవల్లి పరిధిలోకి వచ్చే 3,5,6,7 డివిజన్ల కార్పొరేటర్ల స్థానాలకు పోటీ చేస్తున్న వివిధ పార్టీలకు చెందిన అభ్యర్థులతో గ్రామ దేవత అసిరితల్లి అమ్మవారి సన్నిధిలోనే గ్రామ పెద్దల సమక్షంలో ప్రత్యేకంగా ప్రతిజ్ఞా తీర్మానం చేయించేలా సన్నాహాలు చేస్తున్నారు.

కిష్టప్పేట ఘటనతోనే కీలక నిర్ణయం

ఇటీవల 5న సానివాడ (కిష్టప్పేట) ఎంపీటీసీ పోలింగ్‌లో అధికార పార్టీ నేతల దౌర్జన్యాలతో మొదలై, 7న కౌంటింగ్‌ కేంద్రంలో అన్యాయాలు, దారుణాల ఘటనలు జరిగాయి. ఇలాంటివి మళ్లీ జరగకూడదనే ఉద్దేశంతోనే గ్రామ పెద్దలు ముందుకు కదిలారు. ఇక్కడ అన్యాయానికి గురై ఓటమిపాలైన బాధితురాలు ఎచ్చెర్ల దివ్య శ్రీధర్‌ అరసవల్లి గ్రామానికి చెందిన కోడలు కావడం కూడా ఇందుకు ఓ కారణం. ఇలాంటి పరిస్థితులు మరే కు టుంబంలోనూ ఎదురుకాకూడదనే.. ప్రమాణ తీర్మానాలు చేయించే ప్రయత్నాలు చేస్తున్నారు.

అరసవల్లి అర్బన్‌ గ్రామం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement