ఎచ్చెర్ల : పొన్నాడ వద్ద ఉన్న కామేశ్వరీ మోడరన్ రైస్ మిల్లు, శ్రీకృష్ణా కామేశ్వరీ మోడరన్ రైస్ మిల్లుల్లో విజిలెన్స్ తనిఖీలు నిర్వహించారు. నిత్యావసర సరుకుల ధరలు పెరుగుతున్న నేపథ్యంలో విజిలెన్స్ డైరెక్టర్ జనరల్ జి.హరీష్‌గుప్తా ఆదేశాల మేరకు శ్రీకాకుళం ప్రాంతీయ నిఘా, అమలు అధికారి వివేకానంద ఆధ్వర్యంలో విజిలెన్స్ లీగల్ మెట్రోలజీ, రెవెన్యూ అధికారులు కలిసి ఈ తనిఖీలు చేపట్టారు. తూకం కొలతల్లో తేడాలు, ప్యాకింగ్ లైసెన్స్‌లు లేకపోవడంతో నాలుగు కేసులు నమోదు చేశారు. రూ.7,23,424 విలువైన 376 బియ్యం ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నారు. తనిఖీల్లో విజిలెన్స్ ఇన్స్పెక్టర్ సతీష్‌కుమార్, అసిస్టెంట్ జియాలజిస్ట్ సురేష్‌కుమార్, అసిస్టెంట్ రిజిస్ట్రార్ ఎర్రంనాయడు, సబ్ ఇన్స్పెక్టర్ రామారావు, సిబ్బంది, లీగల్ మెట్రాలజీ అధికారి బలరామకృష్ణ, రెవెన్యూ అధికారులు సంతోష్, ఝాన్సీ పాల్గొన్నారు.


