ఇలా ఆవిష్కరించి.. అలా ముసుగేశారు! | - | Sakshi
Sakshi News home page

ఇలా ఆవిష్కరించి.. అలా ముసుగేశారు!

Nov 13 2026 12:16 AM | Updated on Nov 13 2026 12:16 AM

శ్రీకాకుళం: జిల్లా కేంద్రంలోని పసగాడ సూర్యనారాయణ మిల్లు జంక్షన్‌లో గురువారం మాజీ మంత్రి గుండ అప్పల సూర్యనారాయణ విగ్రహావిష్కరణలో అధికార పార్టీ నేతలు రాజకీయం చేశారు. కార్పొరేషన్‌ ఎన్నికల నేపథ్యంలో గుండ అభిమానులు ఎక్కడ దూరమవుతారోనని, ఎన్నికల కోడ్‌ వస్తుందని తెలిపి, హుటాహుటిన విగ్రహావిష్కరణ చేశారు. ఉదయం 10.30 గంటల సమయంలో వి గ్రహావిష్కరణ జరగగా మధ్యాహ్నం రెండు గంటలకు ఎన్నికల కోడ్‌ సందర్భంలో దానికి ముసుగు వేశారు. దీనిపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నా యి. గురువారం మధ్యాహ్నం 12.30 తర్వాత నగరపాలక సంస్థ పాలకవర్గానికి సంబంధించిన ఎన్నికల నోటిఫికేషన్‌ వెలువడుతుందని అధికారులు, ప్రజా ప్రతినిధులు చెబుతూ వస్తున్నారు. ఈ తరుణంలో ఆదరాబాదరాగా విగ్రహావిష్కరణ జరప డం గుండ అనుచరులు, అభిమానుల మెప్పుకోస మేనని వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి. అలాగే ప్రస్తుతం ఏర్పాటు చేసిన విగ్రహంలో మచ్చుకై నా అప్పల సూర్యనారాయణ పోలికలు లేకపోవడంపై నగర వాసులు మండిపడుతున్నారు.

ఆది నుంచీ వివాదాస్పదమే..

గుండ అప్పలసూర్యనారాయణ విగ్రహ ఏర్పాటు కు సంబంధించి తొలి నుంచి అధికార పార్టీ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతూనే ఉంది. పార్టీ తరఫున విగ్రహం ఏర్పాటు చేస్తామని చెప్పి గాలికొదిలేశారు. దీంతో అరసవల్లి వాసులతోపాటు కుటుంబ సభ్యులు అప్పల సూర్యనారాయణ విగ్రహ ఏర్పాటునకు ఉపక్రమించారు. ఇది నచ్చని అధికార పార్టీ యంత్రాంగం రెండుసార్లు దిమ్మలను కూలదోసింది. ఈ విషయంలో శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్‌ తీరును ప్రతి ఒక్కరూ తప్పు పట్టారు. తాజాగా గుండ లక్ష్మీదేవి పార్టీ మారిన సందర్భంలో స్థానిక శాసనసభ్యుడు గొండు శంకర్‌ దిమ్మలు కూల్చడంలో తమ ప్రమేయం లేదని, అధికారుల అనుమతి తీసుకోకపోవడం వల్ల కూల్చివేశారని చెబుతూ తానే కొత్త విగ్రహాన్ని అప్పల సూర్యనారాయణ జయంతి రోజున కానీ వర్ధంతి రోజున కానీ ఆవిష్కరిస్తానని చెప్పుకొచ్చారు. ఈ లెక్కన జనవరి నెలలో విగ్రహావిష్కరణ జరగాల్సి ఉండగా అనూహ్యంగా గురువారం విగ్రహావిష్కరణ జరపడం రాజకీయమే తప్ప అభిమానం కాదని నగర వాసులు అంటున్నారు.

గుండ అప్పలసూర్యనారాయణ విగ్రహావిష్కరణ

ఎన్నికల కోడ్‌ అంటూ ముసుగు వేసిన దృశ్యం

తూతూమంత్రంగా సమాచారం..

విగ్రహావిష్కరణకు సంబంధించి బుధవారం రాత్రి ఎనిమిది గంటల తర్వాత పార్టీ శ్రేణులకు సమాచారం ఇవ్వగా గుండ కుటుంబ సభ్యులకు ఇదే సమయంలో తూతూ మంత్రంగా అధికారు ల ద్వారా సమాచారం ఇవ్వడంపై కూడా వి మర్శలు వినిపిస్తున్నాయి. అప్పల సూర్యనారాయణ తనయులు విదేశాల్లో ఉంటున్న విషయం అందరికీ తెలిసిందే. శాసనసభ్యుడు గతంలో ప్రకటించినట్లుగా అప్పల సూర్యనారాయణ వ ర్ధంతి రోజున గానీ జయంతి రోజున గానీ విగ్రహావిష్కరణ జరిపించి ఉంటే అప్పటికి వారు సైతం వచ్చేవారు. దీంతో పాటు అరసవల్లిలోని ప్రాంగణానికి అప్పలసూర్యనారాయణ పేరు పెట్టాలనే ప్రతిపాదన ఎప్పటి నుంచో ఉంది. ఎన్నికల కోడ్‌ వల్ల దాన్ని ఏర్పాటు చేయలేకపోయామని చెప్పడం కూడా వివాదాస్పదమైంది. నిజంగా పేరు పెట్టాలని ఎమ్మెల్యే గతంలోనే అనుకుని ఉంటే ఈ ప్రాంగణంలో నిర్మించిన కల్యాణ వేదికకు దివంగత నేత ఎర్రన్నాయుడు పేరును పెట్టినప్పుడే ప్రకటించి ఉండేవారని ఆ పార్టీ శ్రేణులు బహిరంగంగానే చెబుతున్నారు. అలా కాకుండా లక్ష్మీదేవి పార్టీ మారిన తర్వాత బోర్డును పూర్తిస్థాయిలో కాకుండా తాత్కాలికంగా ఫ్లెక్సీని ఏర్పాటు చేయించి ఎన్నికల కోడ్‌ వలన దీన్ని అమర్చలేకపోయామని చెప్పడం విడ్డూరంగా ఉందని వ్యాఖ్యానిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement