పేకాట స్థావరంపై పోలీసుల దాడులు | - | Sakshi
Sakshi News home page

పేకాట స్థావరంపై పోలీసుల దాడులు

Aug 17 2026 1:47 AM | Updated on Aug 17 2026 1:47 AM

రొద్దం: మండల పరిధిలోని దొడగట్ట శివారు ప్రాంతంలో పేకాట జోరుగా సాగుతోందన్న సమాచారంలో ఆదివారం ఎస్‌ కుళ్లాయప్ప ఆధ్వర్యంలో పోలీసులు దాడులు చేశారు. ఈ దాడుల్లో 18 మంది జూదర్లు పట్టుబడినట్లు ఎస్‌ఐ పేర్కొన్నారు. జూదర్లపై కేసు నమోదు చేసి, వారి నుంచి రూ.93 వేలు నగదు స్వాధీనం చేసుకున్నామన్నారు. మండలంలో ఎక్కడైనా పేకాట నిర్వహించినా, ఆడినా గట్టి చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పట్టుబడిన వారిలో కొందరు కర్ణాటకకు చెందిన వారు ఉన్నారన్నారు.

సూపరింటెండెంట్‌కు

రాష్ట్రస్థాయి అవార్డు

పుట్టపర్తి టౌన్‌: జిల్లా ప్రొహిబిషన్‌, ఎకై ్సజ్‌ అసిస్టెంట్‌ సూపరింటెండెంట్‌ నరసింహులుకు రాష్ట్రస్థాయి ఉత్తమ ప్రతిభ సేవా పురస్కారం దక్కింది. 80 స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్రస్థాయిలో ప్రతిభ కనబరిచిన అధికారులకు ఉత్తమ సేవా పురస్కారాలు అందజేశారు. శనివారం విజయవాడలో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రొహిబిషన్‌ ఎకై ్సజ్‌శాఖ కమిషనర్‌ చెరుకూరి శ్రీధర్‌ చేతుల మీదుగా నరసింహులు అవార్డు అందుకున్నారు.

అక్రమంగా తరలిస్తున్న బియ్యం పట్టివేత

రామగిరి: మండలంలోని ఎన్‌.ఎస్‌గేట్‌ నుంచి పేరూరుకు వెళ్లే ప్రధాన రహదారిలో అక్రమంగా కర్ణాటకకు తరలిస్తున్న రేషన్‌ బియ్యాన్ని ఆదివారం పట్టుకొన్నట్లు ఎస్‌ఐ ప్రదీప్‌రాజ్‌ తెలిపారు. వాహనాల తనిఖీ చేస్తుండగా ఐచర్‌ (ఏపీ39యూపీ4411)లో 150 బస్తాల రేషన్‌ బియ్యాన్ని కర్ణాటకకు తరలిస్తుండగా పట్టుకున్నట్లు పేర్కొన్నారు. వాహనాన్ని స్వాధీనం చేసుకొని అనంతపురానికి చెందిన వాహన డ్రైవర్‌ హిదాయతుల్లాను అదుపులోకి తీసుకున్నట్లు పేర్కొన్నారు. వాహన యజమాని సద్దాంహుస్సేన్‌, సోము పరారయ్యారని, కేసు నమోదు చేసుకొని వాహనాన్ని పోలీస్‌స్టేషన్‌కు తరలించినట్లు వివరించారు.

టెట్‌ రద్దు చేయమంటే టీచర్లపై సస్పెన్షన్‌ వేటు వేస్తారా?

పుట్టపర్తి: ఉపాధ్యాయ అర్హతా పరీక్ష (టెట్‌) రద్దు చేయాలని కేంద్ర విద్యాశాఖ మంత్రికి విన్నవించిన ఐదుగురు ఉపాధ్యాయులను సస్పెండ్‌ చేయడాన్ని వైఎస్సార్‌టీఏ జిల్లా నాయకులు తీవ్రంగా ఖండించారు. సమస్యలపై వినతి పత్రాలు ఇవ్వడం ఉపాధ్యాయ సంఘాల కనీస కర్తవ్యమని, దీన్ని ఆసరాగా తీసుకొని క్రమ శిక్షణ చర్యల పేరుతో ఉపాధ్యాయులను సస్పెండ్‌ చేయడం దుర్మార్గమని వైఎస్సార్‌టీఏ జిల్లా అధ్యక్షులు పీవీ రమణారెడ్డి, ప్రధాన కార్యదర్శి బడా హరిప్రసాద్‌రెడ్డి చంద్రబాబు ప్రభుత్వంపై మండిపడ్డారు. ఈ మేరకు వారు వేర్వేరు ప్రకటనలను విడుదల చేశారు. 20 నుంచి 30 సంవత్సరాలు సర్వీస్‌ పూర్తి చేసిన వారిని ప్రస్తుతం టెట్‌ పేరుతో మానసిక వేదనకు గురి చేయడం సరికాదన్నారు. ఏదైనా చట్టం అమలు చేసే నాటి నుంచి అది అమల్లోకి వస్తుంది కానీ టెట్‌కు ముందు నుంచే సర్వీస్‌లో ఉన్న ఉపాధ్యాయులకు ఏం సంబంధమని ప్రశ్నించారు. ఉపాధ్యాయులపైనా రెడ్‌బుక్‌ రాజ్యాంగం అమలు చేస్తే ఊరుకునేది లేదన్నారు. నిబంధనల పేరుతో ఉపాధ్యాయులను వేధించడం తగదన్నారు. వేధింపులు ఆపకపోతే కలసి వచ్చే ఉపాధ్యాయ సంఘాలతో కలిసి ఉద్యమిస్తామన్నారు. ప్రజాస్వామ్యంలో నిరసనలకు తావు లేదా అని ప్రశ్నించారు.

సిలిండర్ల అపహరణ

నార్పల: మండల పరిధిలో పది రోజుల క్రితం గ్యాస్‌ సిలిండర్ల దొంగతనం జరిగిన విషయం మరవక ముందే ఇప్పుడు లక్ష్మీనగర్‌ కాలనీలో అలాంటి ఘటనే జరిగింది. కాలనీకి చెందిన కాటమరెడ్డి నివాసంలో మూడు , శీనా నివాసంలో మూడు సిలిండర్లను శనివారం అర్ధరాత్రి దొంగలు ఎత్తుకెళ్లారు. వరుసగా దొంగతనాలు జరుగుతుండటంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాత్రివేళల్లో పోలీసులు గస్తీ పెంచి దొంగతనాలను అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement