క్రీడాకారుల కమిటీ ఏర్పాటుకు నామినేషన్ల ఆహ్వానం | - | Sakshi
Sakshi News home page

క్రీడాకారుల కమిటీ ఏర్పాటుకు నామినేషన్ల ఆహ్వానం

Jul 15 2026 5:15 AM | Updated on Jul 15 2026 5:15 AM

కదిరి అర్బన్‌: జిల్లా కబడ్డీ క్రీడాకారుల కమిటీ ఏర్పాటుకు కబడ్డీ క్రీడాకారుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా కబడ్డీ అసోషియేషన్‌ అధ్యక్షుడు వెంకటరమణనాయక్‌, ప్రధాన కార్యదర్శి సుహాసిని మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. జాతీయ క్రీడల పాలనాచట్టం–2025, ఆంధ్ర కబడ్డీ అసోషియేషన్‌ అమలు చేస్తున్న సంస్కరణల్లో భాగంగా జిల్లా కబడ్డీ క్రీడాకారుల కమిటీ ఏర్పాటు చేసేందుకు అర్హులైన కబడ్డీ క్రీడాకారుల నుంచి నామినేషన్లు ఆహ్వానిస్తున్నట్లు వారు తెలిపారు. సీనియర్‌ అంతర్జాతీయ కబడ్డీ పోటీల్లో పాల్గొన్నవారు, సీనియర్‌ జాతీయ కబడ్డీ ఛాంపియన్‌షిప్‌లో (పురుషులు,మహిళలు) పాల్గొన్నవారు, రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహించిన క్రీడాకారులు ఈనెల 20 లోపు ysrikanth365@gmail.com, లేదా 9060234567 వాట్సాప్‌ నంబర్‌కు క్రీడా సర్టిఫికెట్లు, సంబంధిత ఆధార పత్రాల ప్రతులను జతపరిచి దరఖాస్తు చేసుకోవాలన్నారు. వివరాలకు సెల్‌: 8886230013లో సంప్రదించాలన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement