అవిసె సాగు..ఆదాయం బాగు | - | Sakshi
Sakshi News home page

అవిసె సాగు..ఆదాయం బాగు

Jul 15 2026 5:15 AM | Updated on Jul 15 2026 5:15 AM

పెనుకొండ: అవిసె.. సాగు చేయడంతో అధిక ఆదాయం లభిస్తుంది. నియోజకవర్గంలోని గొర్రెలు, మేకల కాపరులు గొర్రెలు, పొట్టేళ్లకు అవిసె మొక్కలు మేతగా విక్రయిస్తూ రూ.లక్షలు ఆర్జిస్తున్నారు.పొట్టేళ్లు, గొర్రెలను బెంగళూరు, తమిళనాడు, హైదరాబాద్‌, ఇతర పట్టణ ప్రాంతాలకు ఎగుమతి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అవిసె ఆకును కాపరులు పెంచుతూ జీవాలకు మేతగా విక్రయించడం ద్వారా రూ.లక్షలు పొందుతున్నారు. గొర్రెలు, పొట్టేళ్లకు ఆవిశ ఆకు ఎంతో ఇష్టమైన మేత. రైతులు తక్కువ నీటితో ఈ అవిసె ఆకును సాగు చేస్తూ రోజూ ఈ జీవాలకు ఆహారంగా అందిస్తున్నారు. ఇటీవల అనేక మంది షెడ్ల నిర్మాణం చేపట్టి అందులో గొర్రెలు పొట్టేళ్లను మేపుతూ వాటికి ఫీడ్‌తో పాటు అవిసె ఆకును అందిస్తూ తక్కువ ఖర్చుతో అధిక ఆదాయం పొందుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement