బత్తలపల్లి: మండలంలోని ఉప్పర్లపల్లి, నెత్తివారంపల్లి గ్రామాల సమీపంలో సాగు చేస్తున్న ప్రకృతి వ్యవసాయ క్షేత్రాలను జర్మనీ (టిమ్ హిక్‌మాన్ ఫ్రం పోట్స్‌డామ్ ఇన్‌స్ట్యూట్ ఫర్ క్‌లైయిమెట్ ఇంఫ్యాక్ట్ రీసర్చ్) (పీఐకే) పరిశోధనా బృందం సందర్శించారు. మంగళవారం బత్తలపల్లి మండలంలోని ఉప్పర్లపల్లిలో ఆదర్శరైతు ప్రసాద్, నెత్తివారంపల్లిలో నారాయణస్వామి ఆంధ్రప్రదేశ్ కమ్యూనిటీ మేనేజ్డ్ నేచురల్ ఫార్మింగ్ (ఏపీ సీఎన్‌ఎఫ్) పద్ధతుల్లో సాగు చేస్తున్న పంటలను జర్మనీకి చెందిన ప్రముఖ అంతర్జాతీయ పరిశోధనా సంస్థ బృందం పరిశీలించింది. ఉప్పర్లపల్లిలో రైతు ప్రసాద్‌కు చెందిన ప్రకృతి వ్యవసాయ క్షేత్రంలో మామిడి రకాలు (ఏ గ్రేడ్ మోడల్) వేరుశనగ పొలాన్ని సందర్శించి, పరిశీలించింది. నెత్తివారంపల్లిలో నారాయణస్వామి సాగు చేసిన వేరుశనగ పొలాన్ని పరిశీలించింది. ఈ పరిశోధనా బృందంలో పీఐకే టీమ్ సహ ప్రధాన పరిశోధకులు ప్రియాంక, శ్రీసత్యసాయి జిల్లా డీపీపీ సాయిలత, యువ పరిశోధక నిపుణులు కిశోర్, ప్రకృతి వ్యవసాయ రాష్ట్రస్థాయి బృందం ప్రతినిధులు ఝూన్సీ తదితరులు పాల్గొన్నారు.


