‘జేఈఈ అడ్వాన్స్‌డ్’లో జిల్లా విద్యార్థుల సత్తా
కదిరి టౌన్: జేఈఈ అడ్వాన్స్‌డ్ ఫలితాల్లో జిల్లా విద్యార్థులు సత్తా చాటారు. సోమవారం విడుదలైన ఫలితాల్లో కదిరికి చెందిన ఉపాధ్యాయుడు ఓబులపతి కుమారుడు ఓంకిరణ్ ఆల్ ఇండియా జనరల్ కేటగిరిలో 1,355 ర్యాంకు సాధించాడు. ఓబీసీ కోటాలో ఓంకిరణ్‌కు 223 ర్యాంకు దక్కింది. అదే విధంగా నల్లమాడ మండలం వంకరకుంట గ్రామానికి చెందిన కేవీ రమణారెడ్డి కుమారుడు కుడుము అనీష్‌రెడ్డికి ఆల్ ఇండియాలో 1,783 ర్యాంకు సాధించాడు. తమ తల్లితండ్రులు ప్రోత్సాహంతోనే మెరుగైన ఫలితాలు సాధించినట్లు ర్యాంకర్లు ఓంకిరణ్, అనీష్‌రెడ్డి తెలిపారు.
‘జేఈఈ అడ్వాన్స్‌డ్’లో జిల్లా విద్యార్థుల సత్తా


