మహానాడులో జీఆర్‌పీ హెడ్ కానిస్టేబుల్ హల్‌చల్
సాక్షి, టాస్క్‌ఫోర్స్: కడపలో జరుగుతున్న మహానాడులో గుత్తి రైల్వే స్టేషన్ పరిధిలోని జీఆర్‌పీలో హెడ్ కానిస్టేబుల్ వాసు హల్‌చల్ చేశాడు. మహానాడులో రెండో రోజు (28వ తేదీ) పాల్గొన్న వాసు.. టీడీపీ నేతలు ఇసురాళ్లపల్లికి చెందిన కిట్టుయాదవ్, లచ్చానుపల్లికి చెందిన రామాంజినేయులుతో ఫొటోలు దిగుతూ సందడి చేశాడు. ఓ ప్రభుత్వ ఉద్యోగి ఓ రాజకీయ పార్టీ కార్యక్రమంలో పాల్గొనడంపై ప్రస్తుం విస్తృత చర్చ జరుగుతోంది. కాగా, ఈ నెల 11న గుత్తికి చెందిన టీడీపీ సీనియర్ నేత కోనంకి కృష్ణపై టీడీపీ కార్యాలయంలోనే వాసు దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ విషయమై కోనంకి కృష్ణ అప్పట్లో పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు. అప్పటి నుంచి వాసు ప్రత్యక్షంగా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటూ టీడీపీ నేతగా చెలామణి అవుతున్నాడు.


