చెవిలో కమ్మలు లాక్కొని ఉడాయింపు
సోమందేపల్లి: మండలంలోని చాకర్లపల్లి రైల్వే గేటు వద్ద జామ పండ్లు విక్రయిస్తున్న ఓ వృద్దురాలి చెవిలోని బంగారు కమ్మలను లాక్కొని దుండగులు పరారయ్యారు. ఈ ఘటన శుక్రవారం చోటు చేసుకుంది. స్నేహలత నగర్‌కు చెందిన జయమ్మ పండ్లు విక్రయిస్తుండగా హిందూపురం వైపు నుంచి ద్విచక్ర వాహనంపై వచ్చిన ఇద్దరు యువకులు ఆమె వద్ద ఆపి, చెవిలోని కమ్మలను బలవంతంగా లాక్కొని ఉడాయించారు. ఘటనతో ఆమె చెవి తమ్మలు తెగిపోయి తీవ్ర రక్త స్రావమైంది. స్థానికులు ఆమెను హిందుపురంలోని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. తులం బరువున్న బంగారు కమ్మలను అపహరించుకెళ్లినట్లు పోలీసులకు బాధితురాలు ఫిర్యాదు చేసింది. ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.


