బడుగులపై పచ్చ బలుపు | - | Sakshi
Sakshi News home page

బడుగులపై పచ్చ బలుపు

Apr 15 2025 12:45 AM | Updated on Apr 15 2025 11:26 AM

శ్రీరామ్‌ అనుచరుల దాష్టీకం..

శ్రీరామ్‌ అనుచరుల దాష్టీకం..

‘ధర్మవరం’లో ‘తమ్ముళ్ల’ దాష్టీకం

రామగిరి తరహాలో ‘పరిటాల’ అనుచరుల బరితెగింపు

బీజేపీ కార్యకర్త కురుబ ఆనంద్‌పై దాడి

తీవ్రంగా గాయపరిచి.. బెదిరించిన వైనం

‘పరిటాల’ దెబ్బకు బీసీ కులస్తుల బెంబేలు

ఆధిపత్యం కోసం అకృత్యాలకు దిగుతున్నారు. తమ బలం చూపించేందుకు బడుగులపై దాడులు చేస్తూ బలి తీసుకుంటున్నారు. నిన్న కురుబ లింగమయ్య, తాజాగా ఆనంద్‌.. ఇద్దరిపైనా దాడి చేసింది ‘పరిటాల’ వర్గమే. పట్టుకోసం అటు రాప్తాడు, ఇటు ధర్మవరంలో హింసాత్మక చర్యలకు పాల్పడుతున్నాపారు. ముఖ్యనేతల జోలికెళ్లే ధైర్యం లేక అమాయకులైన బీసీలపై దాడులు చేస్తూ భయకంపితులను చేస్తున్నారు.

ధర్మవరం నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జ్‌ పరిటాల శ్రీరామ్‌ అండతో ఆయన అనుచరులు నానా హంగామా చేస్తున్నారు. బీజేపీ నాయకులను భయపెట్టేందుకు బీసీ కులాలను టార్గెట్‌ చేసుకుని దాడులకు దిగుతున్నారు. మద్యం దుకాణాల నిర్వహణ మొదలుకుని.. ఫీల్డ్‌ అసిస్టెంట్లు, రేషన్‌ డీలర్ల నియామకం.. ఇలా ప్రతి విషయంలో బీజేపీ నేతల పెత్తనాన్ని ఎక్కడికక్కడ.. ఎప్పటికప్పుడు అడ్డుకుంటూ వస్తున్నారు. ఎక్కడైనా ఎదురుతిరిగితే దాడులకు తెగబడుతున్నారు. ఈ క్రమంలోనే తాడిమర్రి మండలంలో మద్యం దుకాణం నిర్వహణలో బీజేపీ నేతలను రెండు నెలల పాటు పరిటాల శ్రీరామ్‌ అనుచరులు అడ్డగించిన సంగతి తెలిసిందే.

పాపిరెడ్డిపల్లి తరహాలోనే.. పరిటాల శ్రీరామ్‌ అండతో టీడీపీ గూండాలు రామగిరి మండలం పాపిరెడ్డిపల్లిలో ఉగాది రోజున కురుబ లింగమయ్యపై దాడి చేసి దారుణంగా హత్య చేశారు. అదే తరహాలో పెద్దకోట్లలో కురుబ కులానికి చెందిన ఆనంద్‌పై దాడికి దిగినట్లు తెలిసింది. పాపిరెడ్డిపల్లి తరహాలోనే పెద్దకోట్లలో కూడా ‘పరిటాల’ సామాజిక వర్గానికి చెందిన వారే దాడికి దిగడం గమనార్హం. పరిటాల శ్రీరామ్‌ అనుచరుల బెదిరింపులతో రాప్తాడు, ధర్మవరం నియోజకవర్గాల్లో బీసీ కులాల నేతలు భయభ్రాంతులకు గురవుతున్నారు.

నెల రోజుల క్రితం ముదిగుబ్బ ఎంపీపీ ఆదినారాయణ యాదవ్‌ వాహనంపై పరిటాల శ్రీరామ్‌ అనుచరులు దాడికి దిగారు. ఒకే కూటమిలో ఉన్నప్పటికీ ఇరు పార్టీల మధ్య సఖ్యత లేదనే విషయం బహిర్గతమైంది. తాజాగా తాడిమర్రి మండలం పెద్దకోట్ల గ్రామంలో బీసీ కులానికి చెందిన ఆనంద్‌ను టీడీపీ నేతలు చితకబాదారు. ఆదివారం సాయంత్రం గొడవ జరగడంతో అదేరోజు రాత్రి ధర్మవరం ఆస్పత్రిలో చేరాడు. అయితే విషయం బయటకు పొక్కుతుందని భావించిన టీడీపీ నేతలు ఆస్పత్రిలో ఉన్న ఆనంద్‌కు వార్నింగ్‌ ఇవ్వగా..రాత్రికి రాత్రే ఆయన డిశ్చార్జ్‌ అయి ఇంటికి చేరుకున్నాడు.

బీసీ నేతలే టార్గెట్‌..

సాక్షి, టాస్క్‌ఫోర్స్‌: కూటమి పార్టీల నేతలు పైన పొత్తులో కనిపిస్తున్నా.. లోన కత్తులు నూరుతున్నారు. మంత్రి సత్యకుమార్‌ ప్రాతినిథ్యం వహిస్తున్న ధర్మవరం నియోజకవర్గంలో తరచూ టీడీపీ, బీజేపీ నేతల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంటోంది. నియోజకవర్గంలో బీజేపీ పెత్తనాన్ని టీడీపీ నేతలు ఓర్వలేకపోతున్నారు. ఈ క్రమంలో ఆధిపత్యం కోసం బీజేపీ నేతలపై తరచూ దాడులకు తెగబడుతున్నారు. ముఖ్యంగా బీసీ సామాజిక వర్గాల నేతలనే టార్గెట్‌ చేస్తున్నారు. ఓటు బ్యాంకు ఆధారంగా ప్రాధాన్యం ఇవ్వాలని ‘తెలుగు తమ్ముళ్లు’ డిమాండ్‌ చేస్తుండగా.. ఎమ్మెల్యే మావాడు...మాకే ప్రాధాన్యం ఇవ్వాలని బీజేపీ నేతలు చెబుతున్నారు. ఈ క్రమంలోనే ఇరువర్గాల మధ్య ఘర్షణలు చోటుచేసుకుంటున్నాయి.

ప్రశ్నిస్తే ప్రాణాలు తీస్తారా?

ఆర్వేటి ఆనంద్‌పై టీడీపీ నేతల దాడి దుర్మార్గం

దుండగులపై చర్యలు తీసుకోవాలి

బీజేపీ, కురుబ సంఘం నాయకుల డిమాండ్‌

ధర్మవరం/తాడిమర్రి: తమ అక్రమాలను ప్రశ్నిస్తే ప్రాణాలు తీసేందుకు కూడా టీడీపీ నేతలు వెనుకాడటం లేదని బీజేపీ, కురుబ సంఘం నాయకులు మండిపడ్డారు. తమ దురాగతాలను బయటపెట్టినందుకే బీజేపీకి చెందిన కురుబ ఆర్వేటి ఆనంద్‌పై టీడీపీ నాయకులు దాడి చేశారన్నారు. మండలంలోని పెద్దకోట్ల గ్రామానికి చెందిన బీజేపీ నాయకుడు కురుబ ఆర్వేటి ఆనంద్‌పై ఆదివారం టీడీపీ నాయకులు దాడి చేశారు. సోమవారం బాధితుడిని పరామర్శించిన బీజేపీ మండల నాయకులు, కురుబ సంఘం నాయకులు అనంతరం ధర్మవరం బీజేపీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ధర్మవరం మార్కెట్‌ యార్డ్‌ డైరెక్టర్‌ కొంకా నాగార్జున మాట్లాడుతూ.. తాడిమర్రి మండలం బీజేపీ ప్రధాన కార్యదర్శి పెద్దకోట్లకు చెందిన కురుబ ఆర్వేటి ఆనంద్‌ గ్రామానికి చెందిన మత్స్యకారుల సొసైటీలో సభ్యుడిగా ఉన్నారన్నారు. మత్స్యకార సొసైటీలోని కొందరు సభ్యులు మత్స్య సంపదను రాజమండ్రికి చెందిన కాంట్రాక్టర్‌కు అప్పజెప్పాలని నిర్ణయించారన్నారు. దీనివల్ల గ్రామానికి గానీ, స్థానిక మత్స్యకారులకు ఎలాంటి ఆదాయం రాదన్నారు. దీంతో ఆర్వేటి ఆనంద్‌ టీడీపీ నేతల నిర్ణయానికి అడ్డుచెప్పారన్నారు. దీన్ని జీర్ణించుకోలేని టీడీపీ నాయకులు ఆదివారం మద్యం సేవించి వచ్చి మరణాయుధాలతో ఆర్వేటి ఆనంద్‌పై దాడి చేశారన్నారు. దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. సమావేశంలో బత్తలపల్లి జెడ్పీటీసీ కోటి సుధ, కురుబ కార్పొరేషన్‌ డైరెక్టర్‌ కాటమయ్య, బీజేపీ నాయకులు దేవర రామ్మోహన్‌, వీరనారప్ప, బిల్లే శ్రీనివాసులు, గొట్లూరు అనీల్‌ పాల్గొన్నారు.

బీజేపీ, కురుబ సంఘం నాయకుల డిమాండ్‌1
1/1

బీజేపీ, కురుబ సంఘం నాయకుల డిమాండ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement