సదస్సులతో ప్రజలకు అవగాహన | Sakshi
Sakshi News home page

సదస్సులతో ప్రజలకు అవగాహన

Published Wed, Nov 15 2023 12:12 AM

- - Sakshi

పుట్టపర్తి అర్బన్‌: ‘వైఎస్సార్‌ జగనన్న శాశ్వత భూ హక్కు– భూ రక్ష’ కింద సమగ్ర భూ సర్వేను ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. జిల్లాలో మూడు విడతలుగా చేపట్టిన రీ సర్వే కార్యక్రమంలో ఇప్పటికే రెండు విడత్లో 77 గ్రామాల్లో సర్వే పనులన్నీ పూర్తయ్యాయి. మూడో విడతలో 150 గ్రామాలకు గాను 26 గ్రామాల్లో సర్వే పూర్తి కాగా, తక్కిన గ్రామాల్లో సర్వే చేయాల్సి ఉంది.

సదస్సులతో ప్రజలకు అవగాహన

జిల్లాలో తొలి విడతగా 26, రెండో విడతలో 51 గ్రామాల్లో రీ సర్వే పూర్తయ్యింది. ఇక మూడో విడతలో 150 గాను 26 గ్రామాల్లో రీ సర్వే పూర్తి చేశారు. ఈ సర్వేలో 32 మంది మండల సర్వేయర్లు, 374 మంది విలేజ్‌ సర్వేయర్లు పాల్గొంటున్నారు. రీ సర్వే పూర్తయితే రైతుల భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుంది. రీ సర్వేపై ఇప్పటికే అన్ని మండలాల్లో ఆర్డీఓలు, తహసీల్దార్లు సదస్సులు ఏర్పాటు చేసి ప్రజలకు అవగాహన కల్పించారు.

91,239 సర్వే రాళ్లు నాటారు

జిల్లాలో చేపట్టిన మూడు విడతల రీ సర్వేలో ఇప్పటి వరకూ 91,239 సర్వేరాళ్లు నాటే కార్యక్రమం పూర్తయ్యింది. తక్కిన గ్రామాల్లో చేపట్టిన సర్వేకు అవసరమైన 46,167 రాళ్లు సిద్ధంగా ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. మండల సరిహద్దులు, గ్రామ సరిహద్దులు, పొలం సరిహద్దులు, సర్వే నంబర్ల వారీగా రాళ్లను నాటుతూ రైతుల పొలం లెక్కను సరి చేస్తున్నారు. మరో పక్క తొలి, రెండో విడతలో ఇప్పటికే సర్వే పూర్తయిన 77 గ్రామాల్లోని రైతులకు పట్టాదార్‌ పాస్‌ పుస్తకాలు సైతం ఆయా మండలాలకు వచ్చేశాయి. తప్పొప్పులను సరిచూసి వాటిని రైతులకు అందజేయనున్నారు. ఇందులో సర్వే నంబర్ల వారీగా పొలం కొలతలు, స్కెచ్‌, సమగ్రంగా పొందు పరిచారు. వీటిని బైలింగ్వల్‌ పద్ధతిలో రెండు బాషల్లో పుస్తకాన్ని ముద్రించారు. క్యూ ఆర్‌ కోడ్‌ను సైతం పొందుపరిచారు. దీన్ని స్కాన్‌ చేస్తే పొలం విస్తీర్ణం, రైతుల వివరాలు తెలుస్తాయని అధికారులు పేర్కొంటున్నారు.

ఉచితంగా మ్యుటేషన్లు, సరిహద్దు రాళ్లు

‘జగనన్న శాశ్వత భూహక్కు–భూ రక్ష’ పథకంలో భాగంగా చేపట్టిన సర్వేలో ప్రభుత్వం ప్రతి రైతుకూ సబ్‌ డివిజన్‌, మ్యుటేషన్‌లతో పాటు సరిహద్దులో నాటే సర్వే రాళ్లను సైతం ఉచితంగా అందజేస్తోంది. గతంలో మ్యుటేషన్‌ చేయించాలంటే చాలా ఇబ్బందులుండేవి. రీ సర్వే వల్ల అలాంటి ఇబ్బందులన్నీ తీరాయి. రీ సర్వే పూర్తయితే రైతుల భూములు కొలిచి వారికి యాజమాన్య హక్కు పత్రాలు ఇవ్వడం, డిజిటల్‌ రికార్డులు రూపొందించడంతో పాటు ప్రభుత్వమే ఉచితంగా మ్యుటేషన్లు, సబ్‌ డివిజన్లు చేస్తోంది.

డిసెంబర్‌ చివరి నాటికి పూర్తి

ఇప్పటి వరకూ మూడు విడతల్లో చేపట్టిన రీ సర్వే కార్యక్రమం డిసెంబర్‌ చివరి నాటికి పూర్తి చేసేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. మూడో విడత గ్రామాల్లో ఫైనల్‌ ఆర్‌ఓఆర్‌ పూర్తి చేసేందుకు ఇప్పటికే ఆదేశాలిచ్చారు. రీ సర్వేలో ఎలాంటి తప్పుల్లేకుండా నిర్వహించి సీసీఎల్‌ఏ ఆదేశాల మేరకు పూర్తి చేయనున్నట్లు పేర్కొంటున్నారు. మొదట రోవర్‌, డ్రోన్‌లతో గ్రామ, మండల సరిహద్దులు గుర్తిస్తారు. అనంతరం అత్యాధునిక పరికరాలతో పొలాల సరిహద్దులు గుర్తించి రాళ్లను నాటుతారు. రీ సర్వేలో రైతులు కచ్చితంగా పాల్గొనాలని, పొలాల సరిహద్దులు నిర్ణయించి రాళ్లను నాటే సమయంలో దగ్గరుండి సరి చూసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

జిల్లాలో జోరుగా సాగుతున్న

సమగ్ర భూసర్వే

మూడు దశల్లో 227 గ్రామాల్లో పనులు

103 గ్రామాల్లో రీ సర్వే పూర్తి

మ్యుటేషన్‌తో పాటు సర్వే రాళ్లూ ఉచితమే

గ్రామాల్లో దశాబ్దాలుగా నెలకొన్న భూవివాదాలను పరిష్కరించడమే లక్ష్యంగా జగన్‌ సర్కార్‌ చేపట్టిన సమగ్ర భూ సర్వే (వైఎస్సార్‌ జగన్‌ శాశ్వత భూహక్కు– భూ రక్ష) జిల్లాలో జోరుగా సాగుతోంది. రైతుల సమక్షంలోనే భూములను సర్వే చేస్తున్నారు. హద్దులు చూపడంతో పాటు రాళ్లు పాతి వివాదాలకు శాశ్వత పరిష్కారం చూపుతున్నారు. ఇప్పటికే 103 గ్రామాల్లో సర్వే ప్రక్రియ పూర్తి కాగా, శాశ్వత యాజమాన్య హక్కు పత్రాలు పొందిన రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

1/4

2/4

సర్వే పూర్తయిన భూములకు ఇచ్చేపట్టాదార్‌ పాస్‌ పుస్తకం
3/4

సర్వే పూర్తయిన భూములకు ఇచ్చేపట్టాదార్‌ పాస్‌ పుస్తకం

గోరంట్ల మండలంలో సిద్ధం చేసిన సర్వే రాళ్లు
4/4

గోరంట్ల మండలంలో సిద్ధం చేసిన సర్వే రాళ్లు

Advertisement
 
Advertisement