రెండో శనివారం, ఆదివారం, వినాయక చవితి పర్వదినం ఇలా వరుస సెలవులు రావడంతో నెల్లూరులోని ప్రధాన ఆర్టీసీ బస్టాండ్ ప్రయాణికులతో కిటకిటలాడింది. విద్యార్థులు, ఉద్యోగులు తమ కుటుంబ సభ్యులతో సొంతూళ్లకు వెళ్లేందుకు వచ్చారు. అయితే అందుకు తగినట్లు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేయకపోవడంతో ప్రయాణికులు గంటల తరబడి వేచిచూడాల్సి వచ్చింది. వచ్చిన అరకొర బస్సుల్లో సీట్ల కోసం ఫీట్లు చేశారు. పరిమితికి మించి ప్రయాణికులు ఎక్కడంతో బస్సుల్లో ప్రమాదపుటంచున ప్రయాణాలు చేయాల్సి వచ్చింది. – సాక్షి ఫొటోగ్రాఫర్ నెల్లూరు


