వేర్వేరు ప్రమాదాల్లో పలువురికి గాయాలు | - | Sakshi
Sakshi News home page

వేర్వేరు ప్రమాదాల్లో పలువురికి గాయాలు

Sep 13 2026 12:24 AM | Updated on Sep 13 2026 12:24 AM

జిల్లాలో శనివారం జరిగిన వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో పలువురు గాయపడ్డారు. ఇద్దరికి తీవ్రగాయాలు కాగా, పలువురు స్వల్పగాయాలతో బయటపడ్డారు.

లారీ ఢీకొని..

ముత్తుకూరు(పొదలకూరు): నడిచి వెళ్తున్న వ్యక్తిని లారీ ఢీకొన్న ఘటన మండలంలోని పిడతాపోలూరు క్రాస్‌రోడ్డు వద్ద శనివారం జరిగింది. నేలటూరుపాళెం గ్రామానికి చెందిన ఏడుకొండలు పిడతాపోలూరులో రోడ్డు దాటుతున్న క్రమంలో లారీ ఢీకొని ఆయన ఎడమ చేతికి గాయమై ఎముక విరిగింది. స్థానికులు 108 అంబులెన్స్‌కు సమాచారం అందించి క్షతగాత్రుడిని ఆస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం నెల్లూరులోని నారాయణ ఆస్పత్రిలో చేర్పించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేపట్టారు.

బైక్‌ అదుపుతప్పి..

వెంకటాచలం: మోటార్‌ బైక్‌ అదుపుతప్పి వ్యక్తి గాయపడిన ఘటన మండలంలోని కసుమూరులో శనివారం జరిగింది. నెల్లూరు నగరం ఆటో నగర్‌ ప్రాంతానికి చెందిన షఫీ పనినిమిత్తం బైక్‌పై కసుమూరుకు వచ్చారు. తిరిగి వెళ్లే సమయంలో ఎదురుగా ఆటో అడ్డురావడంతో బైక్‌ అదుపుతప్పి పడింది. ఈ ప్రమాదంలో షఫీకి గాయాలవ్వడంతో చికిత్స నిమిత్తం నెల్లూరుకు తరలించారు.

కాలువలోకి దూసుకెళ్లిన కారు

సంగం: కారు అదుపుతప్పి కాలువలోకి దూసుకెళ్లిన ఘటన మండలంలోని దువ్వూరు సమీపంలో శనివారం జరిగింది. వివరాలిలా ఉన్నాయి. వైఎస్సార్‌ కడప జిల్లా బద్వేల్‌ నుంచి జయరామిరెడ్డి అనే వ్యక్తి ఓ పేషెంట్‌ను తీసుకుని నెల్లూరులోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి వస్తున్నారు. దువ్వూరు సమీపంలో కారు ప్రమాదవశాత్తు అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న కాలువలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న ఇద్దరికి స్వల్పగాయాలయ్యాయి. సమాచారం అందుకున్న వెంటనే 108 సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.

విద్యుత్‌ స్తంభాన్ని ఢీకొని..

మర్రిపాడు: రోడ్డు పక్కన ఉన్న విద్యుత్‌ స్తంభాలను కారు ఢీకొన్న ఘటన మర్రిపాడు సబ్‌స్టేషన్‌ సమీపంలో శనివారం జరిగింది. వివరాలిలా ఉన్నాయి. నెల్లూరు నుంచి వైఎస్సార్‌ కడప జిల్లా బద్వేలు వైపు వంశీ, బ్రహ్మయ్య, కంటే ప్రసాద్‌తో పాటు ఓ చిన్నారి, మహిళ కారులో వెళ్తున్నారు. ఈ క్రమంలో మర్రిపాడు సబ్‌స్టేషన్‌ సమీపంలో కారు ప్రమాదవశాత్తు అదుపుతప్పి రోడ్డు పక్కన ఉంచిన విద్యుత్‌ స్తంభాలను ఢీకొట్టింది. ఈ ఘటనలో ఒకరికి తీవ్రగాయాలు కాగా, మరో ముగ్గురికి స్వల్ప గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న 108 సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement