● బైక్‌ను ఢీకొన్న లారీ
● ఆస్పత్రిలో చికిత్స పొందుతూ వ్యక్తి మృతి
సంగం: మండలంలోని తరుణవాయి సమీపంలో జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికులు, పోలీసుల కథనం మేరకు.. బుచ్చిరెడ్డిపాళేనికి చెందిన ఇనకర్ల శీనయ్య (40) మున్సిపాలిటీలో ట్రాక్టర్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. అతడికి భార్య, ఇద్దరు పిల్లలున్నారు. సంగంలోని బంధువులు నిర్వహిస్తున్న మాతా పరమేశ్వరి పొంగళ్ల కార్యక్రమానికి ఆదివారం సాయంత్రం శీనయ్య బైక్‌పై బయలుదేరాడు. ఈ క్రమంలో తరుణవాయి సమీపంలో ఎదురుగా వస్తున్న లారీ బైక్‌ను ఢీకొంది. ఈ ఘటనలో అతను తీవ్రంగా గాయపడ్డాడు. ప్రమాదం అనంతరం లారీని అక్కడే నిలిపి డ్రైవర్ పరారయ్యాడు. స్థానికులు గమనించి క్షతగాత్రుడిని 108 వాహనంలో నెల్లూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతిచెందాడు. ఈ ఘటనపై సంగం ఎస్సై భోజ్యానాయక్ కేసు నమోదు చేశారు.
ఘటనా స్థలంలో శీనయ్య


