మాట్లాడుతున్న రామ్‌కుమార్‌రెడ్డి
● నేదురుమల్లి రామ్‌కుమార్‌రెడ్డి
వాకాడు: వైఎస్సార్‌సీపీ అభివృద్ధికి నాయకులు, కార్యకర్తలు సమష్టిగా కృషి చేయాలని ఆ పార్టీ వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్త నేదురుమల్లి రామ్‌కుమార్‌రెడ్డి అన్నారు. వాకాడులోని తన నివాసంలో ఆదివారం వాకాడు, కోట, చిట్టమూరు మండలాలకు చెందిన నాయకులు, కార్యకర్తలతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. నాయకులు, కార్యకర్తలు ప్రజలకు అందుబాటులో ఉండాలని, వారి సమస్యలను తమ దృష్టికి తీసుకొస్తే పరిష్కారానికి కృష్టి చేద్దామన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతి గ్రామంలో వైఎస్సార్‌సీపీ జెండా ఎగిరేలా ఇప్పటినుంచే క్షేత్రస్థాయిలో కార్యాచరణ రూపొందించుకోవాలన్నారు. అధికార పార్టీ నాయకులు ఎన్ని తప్పుడు కేసులు పెట్టి భయపెట్టినా బెదిరేదిలేదన్నారు. ప్రజలంతా వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డితోనే ఉన్నారన్నారు. పార్టీ విజయమే లక్ష్యంగా ప్రతి కార్యకర్త అంకిత భావంతో పని చేయాలని పిలుపునిచ్చారు.


