కావలి : రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయ వనరుగా వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి దూరచూపుతో, ఎంతో ప్రతిష్టాత్మకంగా రామాయపట్నం పోర్టును నిర్మిస్తే.. చంద్రబాబు దాన్ని కాజేసేందుకు తన బినామీల పేరుతో ప్రైవేటీకరణకు శ్రీకారం చుడుతున్నాడు. ప్రజలకు సంపద సృష్టిస్తానని చెప్పిన చంద్రబాబు తను, తన బినామీలకు ప్రభుత్వ ఆస్తులను దోచి పెట్టి సంపద సృష్టించుకుంటున్నాడని కావలి మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి ఆరోపించారు. రామాయపట్నం ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఈ నెల 18న ‘చలో రామాయపట్నం’ వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని చెప్పారు. మంగళవారం స్థానిక వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో రామిరెడ్డి మీడియాతో మాట్లాడారు. జగనన్న సంపద సృష్టిస్తే.. చంద్రబాబు దోచుకుంటున్నాడని ధ్వజమెత్తారు. కావలికి 15 కి.మీ. దూరంలో ఉన్న రామాయపట్నం పోర్టు పూర్తయితే కనకపట్నం వైపు అడుగులు వేస్తుందని ఆశించామన్నారు.
హార్బర్లు, పోర్టులు ప్రైవేటీకరిస్తే సహించం
చంద్రబాబు అధికారంలోకి వచ్చిన నాటి నుంచి పోర్టులు, ఫిషింగ్ హార్బర్లు, ఫిష్‌యార్డులు, మెడికల్ కాలేజీలు.. ఇలా ప్రభుత్వ ఆస్తుల ప్రైవేటీకరణ జపం చేస్తున్నాడని రామిరెడ్డి మండిపడ్డారు. సుమారు రూ.5 వేల కోట్లతో పూర్తి చేసిన రామాయపట్నం పోర్టును కేవలం రూ.వెయ్యి కోట్ల ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టాలనుకుంటున్నారని ప్రజలందరూ గమనిస్తున్నారన్నారు. పోర్టు అనుబంధంగా తమ ప్రభుత్వ హయాంలోనే సోలార్ వంటి ఎన్నో సంస్థలు ముందుకొచ్చాయన్నారు. కార్యకలాపాలు ప్రారంభమైతే చెన్నాయపాళెం, ఆనెమడుగు, రుద్రకోట, మద్దూరుపాడు వరకు పారిశ్రామికంగా ఎంతో అభివృద్ధి చెందుతుందన్నారు. ఇప్పటికే జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్‌ను కూడా ప్రైవేట్‌కు కట్టబెట్టారని, పూర్తి స్థాయిలో కట్టబెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయని, ఇది చంద్రబాబు దివాళా కోరు తనానికి నిదర్శనమని మండిపడ్డాడు. మత్స్యకారుల సొత్తు దీనిని ప్రైవేటీకరిస్తే తాము ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకునే పరిస్థితే లేదని తేల్చి చెప్పారు.
అభివృద్ధి అంటే జగనన్న..
దోపిడీ అంటే చంద్రబాబు
అప్పట్లో రాష్ట్రం ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నా, మరో పక్క కోవిడ్‌తో రాష్ట్ర రాబడి తగ్గిపోయినా సరే ఒక పక్క సంక్షేమ పథకాలు ఇస్తూనే ఆంధ్రప్రదేశ్ తీరం వెంబడి నాలుగు పోర్టులు, 11 ఫిషింగ్ హార్బర్స్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రారంభించారన్నారు. పోర్టులు, హార్బర్లే కాకుండా 17 మెడికల్ కాలేజీలను నిర్మాణానికి శ్రీకారం చుట్టారన్నారు. అదే విధంగా ఏ గ్రామానికి పోయినా కూడా ఒక సచివాలయము, ఒక ఆర్బీకే సెంటర్, ఒక హెల్త్ సెంటర్, ఒక మిల్క్ డెయిరీ నిర్మాణంతోపాటు గ్రామాలు, పట్టణాల్లో రోడ్లు, డిస్ట్రిక్ట్ టు డిస్ట్రిక్ట్ కనెక్టింగ్ రోడ్స్, హైవే బ్రిడ్జెస్ కావొచ్చు ఇవన్నీ కూడా జగన్‌మోహన్‌రెడ్డి హయాంలో రూపుదిద్దుకున్నవేనన్నారు. చంద్రబాబు వచ్చి అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేస్తూ.. చేసిన అభివృద్ధి పనుల ఫలాలను ప్రజలకు ఇవ్వకుండా తన బినామీలకు దోచి పెట్టే పనిలో ఉన్నారని మండిపడ్డారు. ఎకరం రూ.99 పైసలకే ఇస్తామని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. అభివృద్ధి అంటే జగనన్న అయితే దోపిడీ అంటే చంద్రబాబు అని అన్నారు.
పోర్టుకు భూములిచ్చిన వారికి
పరిహారం ఇవ్వండి
రామాయపట్నం పోర్టుకు భూములిచ్చిన నిర్వాసితులకు సంపూర్ణ నష్టపరిహారం చెల్లించాలని రామిరెడ్డి డిమాండ్ చేశారు. పోర్టు అనుబంధంగా ఎన్నో ప్రాజెక్ట్‌లు వస్తున్నాయని, వాటికి సంబంధించి భూసేకరణ జరుగుతున్న నేపథ్యంలో వారికి సైతం సముచిత నష్టపరిహారం ఇవ్వాలని కోరారు. ఆ ప్రాంత యువతకు ఉద్యోగావకాశాలు కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. గూడు కోల్పోయిన నిర్వాసితులకు పునరావాసం కల్పించి ఇళ్లు కట్టించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు.
గ్రావెల్ దందాపై టీడీపీ నేతలే ఫిర్యాదులు
కావలి నియోజకవర్గంలో గ్రావెల్ దందా యథేచ్ఛగా జరుగుతోంది. దీనిపై తమ నాయకులు అధికారులకు ఫిర్యాదులు చేసినా పట్టించుకోవడం లేదు. రెవెన్యూ, మైనింగ్, ఇరిగేషన్ శాఖలు స్పందించకపోవడంతో గ్రామాల్లో ఘర్షణలకు కారణమవుతుందన్నారు. ఈ క్రమంలో ఏ పాపం తెలియని కొందరు కేసుల్లో ఇరుక్కొని ఇబ్బందులు పడుతున్నారన్నారు. టీడీపీ నేతలు సాగిస్తున్న ఈ అరాచకాలను, అన్యాయాలను సహించలేక ఆ పార్టీ నేతలే ఫిర్యాదులు చేసే పరిస్థితి ఏర్పడిందన్నారు.
రామాయపట్నం పోర్టు కోసం
జగనన్న తపించాడు
ఫస్ట్ ఫేజ్‌లో నాలుగు బెర్తులతో సిద్ధం
చంద్రబాబు తన బినామీల పేరుతో కాజేసే కుట్రలు
ఈ నెల 18న చలో రామాయపట్నం


