ఓటర్ల ప్రత్యేక సవరణ (ఎస్‌ఐఆర్) ప్రక్రియ గడువును మరో మూడు నెలలు పొడిగించాలని సీపీఐ జిల్లా కార్యదర్శి అరిగెల సాయి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ జిల్లాలో సర్ ప్రక్రియ పూర్తిస్థాయిలో, సక్రమంగా జరగలేదన్నారు. అతి తక్కువ సమయంలో ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తూ ఓటరు వివరాల సవరణ పూర్తి చేయాలని చెప్పడం సమంజసం కాదన్నారు. రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కు ప్రతి అర్హుడికి అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, అధికారులు ప్రత్యేక శ్రద్ధతో పనిచేయాలని కోరారు. ప్రతి అర్హుడి పేరు ఓటరు జాబితాలో నమోదయ్యేలా చూడాలన్నారు. గడువు పొడిగించాలంటూ మంగళవారం కలెక్టరేట్ వద్ద చేపట్టే నిరసన కార్యక్రమంలో ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. అలాగే జిల్లాలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల వద్ద నిరసన కార్యక్రమాలు నిర్వహించి, సంబంధిత అధికారులకు వినతిపత్రాలు అందజేయాలని పార్టీ శ్రేణులకు సూచించారు. కార్యక్రమంలో నాయకులు వి.రామరాజు, సిరాజ్, మధు తదితరులు పాల్గొన్నారు.
మాట్లాడుతున్న సీపీఐ నేతలు


