వెంకటాచలం(పొదలకూరు): మూడేళ్ల ఎల్‌ఎల్‌బీ 6వ సెమిస్టర్ పరీక్ష ఫలితాల్లో తమకు తీవ్ర అన్యాయం జరిగిందని పలువురు విద్యార్థులు ఆరోపించారు. మండలంలోని కాకుటూరు వద్దనున్న విక్రమ సింహపురి యూనివర్సిటీలో వీసీ అల్లం శ్రీనివాసరావును సోమవారం కలిసి వినతిపత్రం అందజేశారు. పరీక్షలకు 330 మంది హాజరుకాగా, 270 మంది ఫెయిల్ అవడంతో రీ వాల్యుయేషన్ కోరామన్నారు. కానీ 80 శాతం మంది మళ్లీ ఫెయి లైనట్లు చెప్పారు. ఫలితాలపై అనుమానాలు ఉన్నాయని, న్యాయం చేయా లని వీసీని కోరారు. వెంటనే ఇద్దరు ఎగ్జామినర్ల చేత రీ వాల్యుయేషన్ జరిపి వారం రోజుల్లో ఫలితాలు ప్రకటిస్తామని వీసీ ప్రకటించారు.
కండలేరులో 29.52 టీఎంసీలు
రాపూరు: కండలేరు జలాశయంలో సోమవారం నాటికి 29.52 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు జలాశయం ఈఈ గజేంద్రరెడ్డి తెలిపారు. కండలేరు నుంచి సత్యసాయి గంగ కాలువకు 2,000, లోలెవల్ కాలువకు 30, పిన్నేరు కాలువకు 5, మొదటి బ్రాంచ్ కాలువకు 70 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు వెల్లడించారు.
నిమ్మ ధరలు (కిలో)
పెద్దవి : రూ.35
సన్నవి : రూ.15
పండ్లు : రూ.5


