● కలెక్టరేట్‌లో
‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’
హాజరైన వివిధ శాఖల అధికారులు
నెల్లూరురూరల్: నెల్లూరులోని కలెక్టరేట్‌కు సోమవారం అర్జీదారులు పోటెత్తారు. వివిధ ప్రాంతాల నుంచి పెద్దఎత్తున తరలివచ్చి కలెక్టర్ హిమాన్షు శుక్లా, జాయింట్ కలెక్టర్ మొగిలి వెంకటేశ్వర్లు, డీఆర్వో విజయకుమార్, మెప్మా పీడీ కిరణ్ కుమార్, డిప్యూటీ కలెక్టర్లు వంశీకృష్ణ, కేశవర్ధన్‌రెడ్డికి వినతిపత్రాలు అందజేశారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి అర్జీని నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని ఆదేశించారు. వృద్ధులు, దివ్యాంగుల సమస్యలపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. ఏ శాఖ పరిధిలోనూ వినతులు పెండింగ్‌లో ఉండకూడదన్నారు. ప్రధానంగా భూ సమస్యలు, ఇతర రెవెన్యూ అంశాలకు సంబంధించి అర్జీలు ఎక్కువగా వస్తున్నాయని వాటిని పరిష్కరించే దిశగా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లాఅధికారులు పాల్గొన్నారు.


