నిద్రలేని రాత్రులు కూడా సంతోషాన్నిస్తాయి.. గుడ్‌న్యూస్‌ చెప్పిన యువీ! | Yuvraj Singh And Hazel Keech Welcome Second Child; Reveal Her Name; See Pic - Sakshi
Sakshi News home page

Yuvraj Singh: నిద్రలేని రాత్రులు కూడా సంతోషాన్నిస్తాయి.. గుడ్‌న్యూస్‌ చెప్పిన యువీ!

Aug 25 2023 7:17 PM | Updated on Aug 25 2023 7:50 PM

Yuvraj Singh Hazel Keech Announce Birth Of 2nd Child Reveals Name - Sakshi

Yuvraj Singh Hazel Keech Second Baby: టీమిండియా మాజీ క్రికెటర్‌ యువరాజ్‌ సింగ్‌ అభిమానులతో శుభవార్త పంచుకున్నాడు. తమ కుటుంబంలో కొత్త సభ్యురాలి ఆగమనం గురించి తెలియజేస్తూ అందమైన ఫొటోను షేర్‌ చేశాడు. తమ ఇంటికి మహాలక్ష్మి వచ్చిందన్న విషయాన్ని శ్రావణ శుక్రవార వేళ ఫ్యాన్స్‌కు తెలియజేశాడు.

మా యువరాణి వచ్చేసింది
ఈ మేరకు.. ‘‘మా యువరాణి ఆరా రాక కారణంగా నిద్రలేని రాత్రులను కూడా సరదాగా గడిపేస్తున్నాం. తన రాకతో మా కుటుంబం పరిపూర్ణమైంది’’ అని యువీ ఇన్‌స్టాలో ఫొటో షేర్‌ చేశాడు. ఇందులో.. యువీ భార్య హాజిల్‌ కీచ్‌ ఒడిలో కొడుకు ఓరియోన్‌ ఉండగా.. ఈ సిక్సర్ల కింగ్‌ చిన్నారి కూతురిని తన ఒడిలో పడుకోబెట్టుకుని పాలు పట్టిస్తున్నాడు.

సిక్సర్ల కింగ్‌ ఆమె చూపులకు బౌల్డ్‌
మనసుకు ఆహ్లాదం కలిగిస్తున్న ఈ దృశ్యం ఎంతో అందంగా ఉందంటూ అభిమానులు యువీ కుటుంబానికి సంబంధించిన అపురూప ఫొటోను వైరల్‌ చేస్తున్నారు. కాగా ఒకే ఓవర్లో ఆరు సిక్సర్లు బాదిన తొలి క్రికెటర్‌గా చరిత్రకెక్కిన యువరాజ్‌ సింగ్‌.. బాలీవుడ్‌ నటి హాజిల్‌ కీచ్‌ చూపులకు మాత్రం బౌల్డ్‌ అయిపోయాడు.


నాలుగేళ్లపాటు ఆమె ప్రేమకై నిరీక్షించిన యువీ.. 2016, నవంబరు 30న పెళ్లి బంధంతో ఆమెను శాశ్వతంగా తన మనిషిగా మార్చేసుకున్నాడు. ఈ జంటకు జనవరి 25, 2022లో బాబు ఓరియోన్‌ జన్మించాడు. తాజాగా ఆరా రూపంలో కూతురు కూడా రావడంతో వీరిది కంప్లీట్‌ ఫ్యామిలీ అయింది.

చదవండి: Asia Cup: షెడ్యూల్‌, జట్లు, ఆరంభ సమయం, లైవ్‌ స్ట్రీమింగ్‌.. వివరాలివే
  

Advertisement
 
Advertisement
Advertisement