Asia Cup: షెడ్యూల్‌, జట్లు, ఆరంభ సమయం, లైవ్‌ స్ట్రీమింగ్‌.. వివరాలివే | Asia Cup 2023: Schedule Squad Timing Venue Live Streaming Details - Sakshi
Sakshi News home page

Asia Cup 2023: పూర్తి షెడ్యూల్‌, జట్లు, మ్యాచ్‌ ఆరంభ సమయం, లైవ్‌ స్ట్రీమింగ్‌.. పూర్తి వివరాలివే

Aug 25 2023 5:40 PM | Updated on Aug 25 2023 6:24 PM

Asia Cup 2023 Schedule Squads Timings Venue Live Streaming Details - Sakshi

ఆసియా క్రికెట్‌ సమరానికి సమయం సమీపించింది. ముల్తాన్‌ వేదికగా ఆగష్టు 30న ఈ వన్డే టోర్నీ షురూ కానుంది. గతేడాది పొట్టి ఫార్మాట్‌లో నిర్వహించిన ఆసియా కప్‌ను శ్రీలంక గెలవగా... పాకిస్తాన్‌ రన్నరప్‌తో సరిపెట్టుకుంది. 

ఈసారి మాత్రం తగ్గేదేలే అంటూ టీమిండియా గట్టి పోటీనిచ్చేందుకు సమాయత్తమవుతోంది. బెంగళూరులోని జాతీయ క్రికెట్‌ అకాడమీలో ఆటగాళ్లకు బీసీసీఐ ప్రత్యేక శిక్షణా శిబిరం ఏర్పాటు చేసింది. ఈ ఈవెంట్‌కు పూర్తిస్థాయిలో సన్నద్ధమయ్యేలా ప్లేయర్ల ఫిట్‌నెస్‌ అంచనా వేసేందుకు యో- యో టెస్టులు నిర్వహిస్తోంది.

వన్డే వరల్డ్‌కప్‌ వంటి ఐసీసీ ఈవెంట్‌కు ముందు ప్రతిష్టాత్మక టోర్నీలో ఈసారి భారత్‌ విజేతగా నిలవాలనే సంకల్పంతో కఠిన వైఖరితో ముందుకు సాగుతోంది. ఈ నేపథ్యంలో ఆసియా కప్‌-2023 పూర్తి షెడ్యూల్‌, జట్లు, ప్రత్యక్ష ప్రసారాలు, మ్యాచ్‌ ఆరంభ సమయం తదితర వివరాలు తెలుసుకుందాం!

ఆసియా వన్డే కప్‌-2023 వేదికలు
పాకిస్తాన్‌, శ్రీలంక సంయుక్తంగా హైబ్రిడ్‌ విధానంలో ఈ టోర్నీకి ఆతిథ్యం ఇవ్వనున్నాయి.

గ్రూప్‌-ఏ జట్లు
►ఇండియా, పాకిస్తాన్‌, నేపాల్‌
గ్రూప్‌-బి జట్లు
►బంగ్లాదేశ్‌, అఫ్గనిస్తాన్‌, శ్రీలంక

ఆసియా కప్‌-2023 పూర్తి షెడ్యూల్‌
►ఆగష్టు 30: పాకిస్తాన్‌ వర్సెస్‌ నేపాల్‌- ముల్తాన్‌- పాకిస్తాన్‌
►ఆగష్టు 31: బంగ్లాదేశ్‌ వర్సెస్‌ శ్రీలంక- క్యాండీ- శ్రీలంక 
సెప్టెంబరు 2: పాకిస్తాన్‌ వర్సెస్‌ ఇండియా- క్యాండీ- శ్రీలంక 

►సెప్టెంబరు 3: బంగ్లాదేశ్‌ వర్సెస్‌ అఫ్గనిస్తాన్‌- లాహోర్‌- పాకిస్తాన్‌
సెప్టెంబరు 4: ఇండియా వర్సెస్‌ నేపాల్‌- క్యాండీ- శ్రీలంక
►సెప్టెంబరు 5: శ్రీలంక వర్సెస్‌ అఫ్గనిస్తాన్‌- లాహోర్‌- పాకిస్తాన్‌ 

సూపర్‌-4 స్టేజ్‌
►సెప్టెంబరు 6: గ్రూప్‌- ఏ టాపర్‌ వర్సెన్‌ గ్రూప్‌-బిలో రెండో స్థానంలో నిలిచిన జట్టు- లాహోర్‌- పాకిస్తాన్‌
►సెప్టెంబరు 9: గ్రూప్‌- బి టాపర్‌ వర్సెస్‌ గ్రూప్‌-బిలో రెండో స్థానంలో నిలిచిన జట్టు- కొలంబో- శ్రీలంక
►సెప్టెంబరు 10: గ్రూప్‌-ఏ టాపర్‌ వర్సెస్‌ గ్రూప్‌-ఏలో రెండో స్థానంలో నిలిచిన జట్టు- కొలంబో- శ్రీలంక

►సెప్టెంబరు 12: గ్రూప్‌-ఏలో రెండో స్థానంలో నిలిచిన జట్టు- గ్రూప్‌-బి టాపర్‌- కొలంబో- శ్రీలంక
►సెప్టెంబరు 14: గ్రూప్‌-ఏ టాపర్‌ వర్సెస్‌ గ్రూప్‌-బి టాపర్‌- కొలంబో- శ్రీలంక.
►సెప్టెంబరు 15: గ్రూప్‌-ఏలో రెండో స్థానంలో నిలిచిన జట్టు వర్సెస్‌ గ్రూప్‌-బిలో రెండో స్థానంలో నిలిచిన జట్టు- కొలంబో- శ్రీలంక
సెప్టెంబరు 17: సూపర్‌ ఫోర్‌ టాపర్‌ వర్సెస్‌ సూపర్‌ ఫోర్‌ సెకండ్‌ టాపర్‌- కొలంబో- శ్రీలంక.

మ్యాచ్‌ల ఆరంభ సమయం(భారత కాలమానం ప్రకారం)
పాకిస్తాన్‌లో జరిగే మ్యాచ్‌లు భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 2.30 నిమిషాలకు, శ్రీలంకలో జరిగే మ్యాచ్‌లు మధ్యాహ్నం మూడు గంటలకు ఆరంభం కానున్నట్లు తెలుస్తోంది.

ప్రత్యక్ష ప్రసారాలు ఎక్కడంటే..
►టీవీలో: స్టార్‌ స్పోర్ట్స్‌- స్టార్‌ స్పోర్ట్స్-1, స్టార్‌ స్పోర్ట్స్‌ 1 హెచ్‌డీ, స్టార్‌ స్పోర్ట్స్‌ 1 హిందీ, స్టార్‌ స్పోర్ట్స్‌ 1 హిందీ హెచ్‌డీ, స్టార్‌ స్పోర్ట్స్‌ సెలక్ట్‌ 1, స్టార్‌ స్పోర్ట్స్‌ సెలక్ట్‌ 1 హెచ్‌డీ, స్టార్‌ స్పోర్ట్స్‌ 2, స్టార్‌ స్పోర్ట్స్‌ 2 హెచ్‌డీ, స్టార్‌ స్పోర్ట్స్‌' తమిళ్‌.
►డిజిటల్‌: డిస్నీ+హాట్‌స్టార్‌(వెబ్‌సైట్‌, మొబైల్‌ యాప్‌).

ఆసియా కప్‌-2023 జట్లు
టీమిండియా:
రోహిత్‌ శర్మ, శుబ్‌మన్‌ గిల్‌, విరాట్‌ కోహ్లి, శ్రేయస్‌ అయ్యర్‌, కేఎల్‌ రాహుల్‌, సూర్యకుమార్‌ యాదవ్‌, తిలక్‌ వర్మ, ఇషాన్‌ కిషన్‌, హార్దిక్‌ పాండ్యా, రవీంద్ర జడేజా, అక్షర్‌ పటేల్‌, శార్దూల్‌ ఠాకూర్‌, జస్‌ప్రీత్‌ బుమ్రా, మహ్మద్‌ షమీ, మహ్మద్‌ సిరాజ్‌, కుల్దీప్‌ యాదవ్‌, ప్రసిద్‌ కృష్ణ.
స్టాండ్‌ బై: సంజూ శాంసన్‌.

పాకిస్తాన్‌:
అబ్దుల్లా షఫీక్, ఫఖర్ జమాన్, ఇమామ్-ఉల్-హక్, బాబర్ ఆజం (కెప్టెన్), సల్మాన్ అలీ ఆఘా, ఇఫ్తికర్ అహ్మద్, తయ్యబ్ తాహిర్, సౌద్ షకీల్, మహ్మద్ రిజ్వాన్, మహ్మద్ హరీస్, షాదాబ్ ఖాన్, మహ్మద్ నవాజ్, ఉసామా మీర్, హరీమ్ అష్రఫ్, హ్యారిస్‌ రవూఫ్‌, మహ్మద్ వసీం, నసీమ్ షా, షాహిన్ అఫ్రిది.

నేపాల్‌:
రోహిత్ పౌడెల్ (కెప్టెన్), మహమ్మద్ ఆసిఫ్ షేక్, కుశాల్ భుర్టెల్, లలిత్ రాజ్‌బన్షి, భీమ్ షర్కీ, కుశాల్ మల్లా, దీపేంద్ర సింగ్ ఐరీ, సందీప్ లామిచానే, కరణ్ కెసి, గుల్షన్ కుమార్ ఝా, ఆరిఫ్ షేక్, సోంపాల్ కమీ, ప్రతిష్ జిసి, కిషోర్ మహతో , అర్జున్ సౌద్, శ్యామ్ ధాకల్, సుదీప్‌ జోరా.

బంగ్లాదేశ్‌
షకీబ్ అల్ హసన్ (కెప్టెన్), లిట్టన్ దాస్, తాంజిద్ హసన్ తమీమ్, నజ్ముల్ హుస్సేన్ శాంటో, తౌహిద్ హృదోయ్, ముష్ఫికర్ రహీమ్, మెహిదీ హసన్ మిరాజ్, తస్కిన్ అహ్మద్, ముస్తాఫిజుర్ రెహ్మాన్, హసన్ మముద్, మెహదీ హసన్, నసూమ్ అహ్మద్, షమీమ్ హుస్సేన్, అఫిఫ్ హుస్సేన్, షోరిఫుల్ ఇస్లాం, ఇబాదత్‌ హుసేన్‌, మహ్మద్ నయీమ్
స్టాండ్‌ బై ప్లేయర్లు - తైజుల్ ఇస్లాం, సైఫ్ హసన్, తంజీమ్‌ హసన్ సకీబ్.
►అఫ్గనిస్తాన్‌, శ్రీలంక ఆసియా కప్‌ టోర్నీకి తమ జట్లు ప్రకటించాల్సి ఉంది.

చదవండి: WC: కోహ్లి, బాబర్‌ కాదు.. ఈసారి అతడే టాప్‌ స్కోరర్‌: సౌతాఫ్రికా లెజెండ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement