వెస్టిండీస్ జ‌ట్టు ప్ర‌క‌ట‌న‌.. విధ్వంస‌కర వీరుడి రీ ఎంట్రీ | WI Announce T20I Squad For England, Ireland Series | Sakshi
Sakshi News home page

WI vs ENG: వెస్టిండీస్ జ‌ట్టు ప్ర‌క‌ట‌న‌.. విధ్వంస‌కర వీరుడి రీ ఎంట్రీ

Jun 3 2025 2:05 PM | Updated on Jun 3 2025 3:07 PM

WI Announce T20I Squad For England, Ireland Series

ఇంగ్లండ్‌, ఐర్లాండ్‌తో టీ20 సిరీస్‌ల‌కు రెండు వెర్వేరు జ‌ట్ల‌ను వెస్టిండీస్ క్రికెట్ ప్ర‌క‌టించింది. గ‌తేడాది బార్బ‌డోస్‌లో ఇంగ్లండ్‌తో జ‌రిగిన టీ20 సిరీస్‌లో గాయప‌డ్డ స్టార్ ఆల్‌రౌండర్ ఆండ్రీ రస్సెల్ తిరిగి జ‌ట్టులోకి వ‌చ్చాడు. అత‌డితో పాటు మాజీ కెప్టెన్‌ హోల్డ‌ర్‌కు సెల‌క్ట‌ర్లు పిలుపునిచ్చారు.

అయితే ర‌స్సెల్ కేవ‌లం ఇంగ్లండ్ సిరీస్‌కు మాత్ర‌మే అందుబాటులో ఉండ‌నున్నాడు. అదేవిధంగా సూప‌ర్ ఫామ్‌లో ఉన్న కీస్ కార్టీ.. ఇంగ్లండ్ సిరీస్‌కు దూరంగా ఉండ‌నున్నాడు. అత‌డు ఐర్లాండ్ ప‌ర్య‌ట‌న‌కు తిరిగి జ‌ట్టులో చేర‌నున్నాడు. టెస్టు కెప్టెన్ రోస్ట‌న్ ఛేజ్, స్టార్ ఓపెన‌ర్ బ్రాండెన్ కింగ్ సైతం ఇంగ్లండ్ టూర్ త‌ర్వాత త‌మ స్వ‌దేశాల‌కు ప‌య‌నం కానున్నారు. మ‌రోవైపు ఈ రెండు సిరీస్‌ల‌కు విధ్వంసక‌ర వికెట్ కీప‌ర్ బ్యాట‌ర్ నికోల‌స్ పూర‌న్ దూర‌మ‌య్యాడు. అత‌డికి సెల‌క్ట‌ర్లు విశ్రాంతి ఇచ్చారు.

విండీస్ జ‌ట్టు ప్ర‌స్తుతం ఇంగ్లండ్‌తో వ‌న్డే సిరీస్ ఆడుతోంది. ఆ త‌ర్వాత జూన్ 6 నుండి 10 వరకు ఇంగ్లండ్‌-విండీస్ మ‌ధ్య మూడు టీ20ల సిరీస్ జ‌ర‌గనుంది. అనంత‌రం ఐర్లాండ్ ప‌ర్య‌ట‌న‌కు వెళ్ల‌నున్న క‌రేబియ‌న్ జ‌ట్టు. .జూన్ 12 నుండి 15 వరకు ఆతిథ్య టీమ్‌తో మూడు టీ20లు ఆడ‌నుంది.

ఇంగ్లండ్‌తో టీ20ల‌కు విండీస్ జ‌ట్టు
షాయ్ హోప్ (కెప్టెన్), కీసీ కార్టీ, జాన్సన్ చార్లెస్, మాథ్యూ ఫోర్డ్, జైడ్ గూలీ, షిమ్రాన్ హెట్మైర్, జాసన్ హోల్డర్, అకేల్ హోసేన్, అల్జారి జోసెఫ్, ఎవిన్ లూయిస్, గుడాకేష్ మోటీ, రోవ్‌మన్ పావెల్, షెర్ఫేన్ రూథర్‌ఫోర్డ్, రొమారియో షెపర్డ్

ఐర్లాండ్‌తో టీ20ల‌కు విండీస్ జ‌ట్టు
షాయ్ హోప్ (కెప్టెన్), జాన్సన్ చార్లెస్, రోస్టన్ చేజ్, మాథ్యూ ఫోర్డ్, షిమ్రాన్ హెట్మైర్, జాసన్ హోల్డర్, అకేల్ హోసేన్, అల్జారి జోసెఫ్, బ్రాండన్ కింగ్, ఎవిన్ లూయిస్, గుడాకేష్ మోటీ, రోవ్‌మన్ పావెల్, ఆండ్రీ రస్సెల్, షెర్ఫేన్ రూథర్‌ఫోర్డ్, రొమారియో షెపర్డ్

Advertisement
 
Advertisement
Advertisement