IND vs ENG: పాపం నితీశ్‌ కుమార్‌.. అత‌డి కోసం ప‌క్క‌న పెట్టేశారు? | Why Is Shardul Thakur Playing Over Nitish Kumar Reddy In England vs India 1st Test? | Sakshi
Sakshi News home page

IND vs ENG: పాపం నితీశ్‌ కుమార్‌.. అత‌డి కోసం ప‌క్క‌న పెట్టేశారు?

Jun 20 2025 4:18 PM | Updated on Jun 20 2025 5:31 PM

Why Is Shardul Thakur Playing Over Nitish Kumar Reddy In England vs India 1st Test?

లీడ్స్ వేదిక‌గా భార‌త్‌-ఇంగ్లండ్ మ‌ధ్య తొలి టెస్టు ప్రారంభ‌మైంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఇంగ్లండ్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. పేస్ బౌల‌ర్ల‌కు పిచ్  అనుకూలించే అవ‌కాశ‌మున్నంద‌న ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ ఈ నిర్ణ‌యం తీసుకున్నాడు. అయితే ఈ మ్యాచ్‌తో యువ ఆట‌గాడు సాయిసుద‌ర్శ‌న్ భార‌త జ‌ట్టు త‌ర‌పున టెస్టు అరంగేట్రం చేశాడు. అదేవిధంగా క‌రుణ్ నాయ‌ర్ ఎనిమిదేళ్ల త‌ర్వాత తిరిగి మ‌ళ్లీ టీమిండియా త‌ర‌పున ఆడుతున్నాడు.

నితీశ్‌పై వేటు.. శార్ధూల్‌కు చోటు
అయితే ఈ మ్యాచ్ ఆడేందుకు భార‌త తుది జ‌ట్టులో స్టార్ ఆల్‌రౌండ‌ర్ నితీశ్‌ కుమార్ రెడ్డికి చోటు ద‌క్క‌క‌పోవ‌డం అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచింది. అత‌డి స్దానంలో వెట‌ర‌న్ ఆల్‌రౌండ‌ర్ శార్ధూల్ ఠాకూర్‌కు టీమ్‌మెనెజ్‌మెంట్ అవ‌కాశ‌మిచ్చింది. ఆస్ట్రేలియా వంటి క‌ఠిన పరిస్థితుల్లో సెంచ‌రీ చేసిన నితీశ్‌ను ఎందుకు ప‌క్క‌న పెట్టార‌న్న ప్ర‌శ్న అంద‌రిలోనూ మెద‌లుతోంది.

కాగా నితీశ్‌ రెడ్డి బ‌దులుగా శార్దూల్ ఠాకూర్ ను జట్టులోకి తీసుకోవడానికి ప‌లు కారణాలు ఉన్నాయి. శార్ధూల్ ప్ర‌స్తుతం అద్బుత‌మైన ఫామ్‌లో ఉన్నాడు. దేశ‌వాళీ క్రికెట్‌లో కూడా ఆల్‌రౌండ్ ప్ర‌ద‌ర్శ‌న‌తో అద‌ర‌గొట్టాడు. అంతేకాకుండా ఈ సిరీస్ ఆరంభానికి ముందు జ‌రిగిన ప్రాక్టీస్ మ్యాచ్‌లో కూడా శార్ధూల్ సెంచ‌రీతో చెల‌రేగాడు. 

మ‌రోవైపు ర‌వీంద్ర జ‌డేజాకు  ఏడో స్ధానంలో టీమ్‌మెనెజ్‌మెంట్ అవ‌కాశ‌మిచ్చింది. ఒక‌వేళ జట్టులో నితీశ్‌ ఉన్నా, అత‌డి బ్యాటింగ్ పొజిషన్ సెట్ చేయ‌డం కాస్త క‌ష్టమ‌య్యేది. అందుకే నితీష్‌కు బ‌దులుగా శార్ధూల్ వైపు టీమిండియా మొగ్గు చూపింది. గ‌తంలో ఇంగ్లండ్‌పై గ‌డ్డ‌పై ఆడిన అనుభ‌వం కూడా ఈ ముంబై క్రికెట‌ర్‌కు ఉంది. ఈ మ్యాచ్‌లో శార్ధూల్ రాణించ‌క‌పోతే రెండో టెస్టుకు నితీష్ తిరిగి జ‌ట్టులోకి వ‌చ్చే ఛాన్స్ ఉంది.

తుది జట్లు
భారత్‌
యశస్వి జైస్వాల్‌, కేఎల్‌ రాహుల్‌, సాయి సుదర్శన్‌, శుబ్‌మన్‌ గిల్‌ (కెప్టెన్‌), రిషభ్‌ పంత్‌ (వికెట్‌ కీపర్‌), కరుణ్‌ నాయర్‌, రవీంద్ర జడేజా, శార్దూల్‌ ఠాకూర్‌, జస్‌ప్రీత్‌ బుమ్రా, మహ్మద్‌ సిరాజ్‌, ప్రసిద్‌ కృష్ణ.

ఇంగ్లండ్‌
జాక్‌ క్రాలే, బెన్‌ డకెట్‌, ఓలీ పోప్‌, జో రూట్‌, హ్యారీ బ్రూక్‌, బెన్‌ స్టోక్స్‌, జేమీ స్మిత్‌ (వికెట్‌ కీపర్‌), క్రిస్‌ వోక్స్‌, బ్రైడన్‌ కార్సే, జోష్‌ టంగ్‌, షోయబ్‌ బషీర్‌.
చదవండి: అచ్చం నాన్నలాగే!.. కుమారుడితో రోహిత్‌- రితికా.. వీడియో వైరల్‌

Advertisement
 
Advertisement
Advertisement