గావస్కర్‌, రవిశాస్త్రి కాదు!.. ఇతడికే కామెంటేటర్‌గా ఎక్కువ జీతం! | Who Is The Highest Paid Indian Cricket Commentator? Know About The List Of Commentators And Their Salaries | Sakshi
Sakshi News home page

గావస్కర్‌, రవిశాస్త్రి కాదు!.. ఇతడికే కామెంటేటర్‌గా ఎక్కువ జీతం!

Jun 25 2025 1:04 PM | Updated on Jun 25 2025 1:42 PM

Who Indian Cricketer earns more for commentary daily?

క్రికెట్ మైదానంలో ఆట‌గాళ్లు త‌మ ప్ర‌ద‌ర్శ‌న‌తో ప్రేక్ష‌కుల‌ను ఎంత‌గా అల‌రిస్తారో.. తమ వ్యాఖ్యానంతో టీవీల ముందు కూర్చునే అభిమానుల‌ను అంతే అల‌రిస్తారు కామెంటేట‌ర్‌లు. ఆట‌గాడిపై ప్ర‌శంస‌ల కురిపించాలన్నా.. బాగా ఆడ‌క‌పోతే విమ‌ర్శ‌లు చేయాలన్న‌.. కొట్టిన షాట్ల‌ను, గ‌త రికార్డుల‌ను విశ్లేషించాల‌న్న మాటలతో మ్యాజిక్ చేసే వ్యాఖ్య‌త‌లు కావాల్సిందే.

రేడియోలో క్రికెట్ కామెంట‌రీ వినే రోజుల నుంచి ఇప్ప‌టివ‌ర‌కు ఎంతో మంది కామెంటేటర్‌లు త‌మ మాటల చాతుర్యంతో ఫ్యాన్స్‌ను అల‌రిస్తూనే ఉన్నారు. ఈ కోవ‌కు చెందిన వారే  భార‌త దిగ్గ‌జ కామెంటేటర్‌లు సునీల్ గ‌వాస్క‌ర్‌, ర‌విశాస్త్రి, హ‌ర్షా భోగ్లే, న‌వ్‌జ్యోత్  సింగ్ సిద్దు. 

వీరంతా ఐసీసీ టోర్నీలు, ద్వైపాక్షిక సిరీస్‌లు, ఐపీఎల్ వంటి ఫ్రాంచైజీ క్రికెట్ లీగ్స్‌లో త‌మ మైక్ ప‌ట్టి సంద‌డి చేస్తారు. మ‌రి ఈ లెజెండ‌రీ కామెంటేర్‌ల ఆదాయం ఎంతో తెలుసా? ఎవ‌రు ఎక్కువ సంపాదిస్తున్నారో మీకు తెలుసా?

క్రిక్‌బ్లోగ‌ర్ రిపోర్ట్స్ ప్ర‌కారం.. మాజీ క్రికెట‌ర్ న‌వ్‌జ్యోత్  సింగ్ సిద్దు అత్య‌ధిక పారితోషికం పొందుతున్న భారతీయ వ్యాఖ్య‌త‌గా నిలిచాడు. అత‌డు ఒక రోజుకు కామెంటేట‌ర్‌గా 15 లక్షలు సంపాదిస్తున్న‌ట్లు తెలుస్తోంది. ఇంగ్లీష్ కంటే హిందీ కామెంట‌రీ అందించ‌డంలో సిద్దుని మించిన వారు లేరు.

త‌న మాట‌లతో అభిమానుల‌ను మంత్ర‌ముగ్ధుల‌ను చేస్తాడు. ఐపీఎల్ స‌మ‌యంలో సిద్దుని కామెంటేట‌ర్‌గా ఎక్కువగా మ‌నం చూస్తాము. అయితే ఐసీసీ టోర్నీలు, ద్వైపాక్షిక సిరీస్‌ల‌లో ఇంగ్లీష్ వ్యాఖ్య‌నం అందించే భార‌త క్రికెట్ దిగ్గ‌జం ర‌వి శాస్త్రి.. రోజుకు రూ. 12 లక్షలు సంపాదిస్తున్నట్లు స‌మాచారం. ర‌విశాస్త్రితో పాటు భార‌త మాజీ ఓపెన‌ర్ సునీల్ గ‌వాస్క‌ర్ కామెంటేట‌ర్‌గా రోజుకు రూ. 7ల‌క్ష‌లు అర్జిస్తున్న‌రంట‌.

క్రిక్‌బ్లోగ‌ర్ రిపోర్ట్స్ ప్ర‌కారం కామెంటేట‌ర్‌ల సంపాద‌న ఇదే..
👉నవజ్యోత్ సింగ్ సిద్ధూ - రూ.15 లక్షలు
👉రవిశాస్త్రి - రూ.12 లక్షలు
👉వీరేంద్ర సెహ్వాగ్ - రూ.10 లక్షలు
👉ఆశిష్ నెహ్రా - రూ.9 లక్షలు
👉ఇర్ఫాన్ పఠాన్ - రూ.7 లక్షలు
👉సునీల్ గవాస్కర్ - రూ.6 లక్షలు
👉దినేష్ కార్తీక్ - రూ. 6 లక్షలు
👉సంజయ్ మంజ్రేకర్ - రూ.6 లక్షలు
👉అనిల్ కుంబ్లే - రూ.5–6 లక్షలు
👉పార్థివ్ పటేల్ - రూ.4–5 లక్షలు
👉అజయ్ జడేజా - రూ. 4 లక్షలు
👉ఛెతేశ్వర్ పుజారా - రూ. 4 లక్షలు
👉దీప్ దాస్‌గుప్తా - రూ.3–4 లక్షలు
👉హర్ష భోగ్లే - రూ. 3 లక్షలు
చదవండి: ఒక‌టికి రెండు సార్లు ఆలోచించండి.. లేదంటే గెల‌వ‌డం క‌ష్ట‌మే: రవిశాస్త్రి
 

Advertisement
 
Advertisement
Advertisement